పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ‘టూల్‌కిట్’ కేసు దర్యాప్తులో భాగంగా బెంగళూరుకు చెందిన పర్యావరణ పరిరక్షకురాలు దిశ రవిని క్రిమినల్ కుట్ర, దేశద్రోహం కింద ఫిబ్రవరి 13 న ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా టూల్‌కిట్ కేసుకు సంబంధించి దిశా రవికి ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు మంగళవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత బాండ్‌పై లక్ష రూపాయలు, అలాగే అదే మొత్తంలో రెండు ష్యురీటిలు వంటి షరతులతో దిశా రవికి బెయిల్ మంజూరు చేశారు.
ముందుగా దిశా రవి బెయిల్ పిటిషన్ పై ఫిబ్రవరి 20న విచారణ జరిపిన కోర్టు తీర్పును రిజర్వులో పెట్టి, ఈ రోజు బెయిల్ ఇస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి చాలా తక్కువ సాక్ష్యాల దృష్ట్యా ఎటువంటి క్రిమినల్ రికార్డ్ లేని ఆమెకు బెయిల్ తిరస్కరించడానికి స్పష్టమైన కారణం లేదని బెయిల్ మంజూరు సందర్భంగా న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు తెలుస్తుంది. మరోవైపు అరెస్ట్ అనంతరం దిశా రవి ఆరు రోజులు పాటుగా పోలీస్ కస్టడీలో ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ