ఎట్టకేలకు నెలల తరబడి నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. బ్రిటన్ ప్రధాన మంత్రి రేసులో ‘లిజ్ ట్రస్’ విజయం సాధించారు. ఈ క్రమంలో ఆమె బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ నేతగా సభ్యుల చేత ఎన్నుకోబడ్డారు. ఈ మేరకు లిజ్ ట్రస్ గెలిచినట్లు భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం వెస్ట్‌మినిస్టర్‌లోని కాన్ఫరెన్స్ సెంటర్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సర్ గ్రాహం బ్రాడీ ఫలితాలను వెల్లడించారు. దీంతో లిజ్ ట్రస్ యూకే కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా ఈ విజయంతో 47 సంవత్సరాల ట్రస్ బ్రిటన్ ప్రధాని పీఠమెక్కనున్న మూడవ మహిళగా రికార్డ్ సృష్టించనున్నారు. ఆన్‌లైన్ మరియు పోస్టల్ బ్యాలెట్ పద్దతి ద్వారా సుమారు 1.60 లక్షల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
లిజ్ ట్రస్‌కు అనుకూలంగా 81,326 ఓట్లు పోలవగా, ఆమెకు పోటీగా బరిలో నిలిచిన భారత సంతతి నేత, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌కు 60,399 ఓట్లు వచ్చాయి. ఇక కన్జర్వేటివ్ పార్టీలోని మొత్తం ఓట్ల సంఖ్య 172,437 కాగా, దీనీలో 82.6 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. వివిధ కారణాలతో 654 బ్యాలెట్ పేపర్లు తిరస్కరణకు గురయ్యాయి. సుమారు 21 వేల ఓట్ల తేడాతో ట్రస్ గెలవడం విశేషం. అయితే దీనికి ముందు వ్యతిరేక ఆరోపణలతో బోరిస్ జాన్సన్ ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకోవడంతో.. కన్జర్వేటివ్ పార్టీలో పోటీ జరిగింది. ఈ నేపథ్యంలో రిషి సునాక్, లిజ్ ట్రస్ మధ్య చివరి వరకు ఉత్కంఠ పోరు నెలకొంది. గత ఆరువారాలుగా సాగిన హోరాహోరీ ప్రచారంలో ఇద్దరు అభ్యర్థులు తమ వాదనలను వినిపించారు. ఈ క్రమంలో సుమారు 600 ప్రశ్నలను ఎదుర్కొన్నారు.
ఇక ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత క్వీన్ ఎలిజబెత్ సెంటర్ 2 ఆడిటోరియం నుంచి లిజ్ ట్రస్ ప్రసంగించారు. తనతో పాటు నాయకత్వ రేసులో పాల్గొన్న నాయకులకు ఆమె థ్యాంక్స్ తెలిపారు. ఈ క్రమంలో ప్రత్యేకంగా రిషి సునాక్‌కు కృతజ్ఞతలు చెప్పారు. తాను కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నికైనందుకు గౌరవంగా భావిస్తున్నానని, గొప్ప దేశానికి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకాన్ని ఉంచిన అందరికీ కృతఙ్ఞతలు అని చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో మన ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయడానికి మరియు యునైటెడ్ కింగ్‌డమ్ సామర్థ్యాన్ని వెలికితీసేందుకు సాహసోపేతమైన చర్య తీసుకుంటానని వెల్లడించారు.
I am honoured to be elected Leader of the Conservative Party.
Thank you for putting your trust in me to lead and deliver for our great country.
I will take bold action to get all of us through these tough times, grow our economy, and unleash the United Kingdom’s potential. pic.twitter.com/xCGGTJzjqb
— Liz Truss (@trussliz) September 5, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ