ఈసారి ఎన్నికల తర్వాత ఢిల్లీ గ‌డ్డ మీద వచ్చేది మ‌న ప్ర‌భుత్వ‌మే – సీఎం కేసీఆర్

Telangana CM KCR Announces Non BJP Govt will Form After 2024 Elections in Centre, Telangana CM KCR Announces Non BJP Govt, Non BJP Govt After 2024 Elections, CM KCR Announces Non BJP Govt, Mango News, Mango News Telugu, Telangana CM KCR, Non BJP Govt, CM KCR Announces Non BJP Govt, CM KCR Latest News And Updates, 2024 Elections, TRS Party, CM KCR 2024 Elections, Telangana News

2024 ఎన్నికల తర్వాత ఢిల్లీ గ‌డ్డ మీద వచ్చేది మ‌న ప్ర‌భుత్వ‌మేనని, అది కూడా బీజేపీయేతర ప్ర‌భుత్వ‌మేనని స్పష్టం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. సోమవారం ఆయన నిజామాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మరియు నూత‌న క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వంపై ఆయన సూటిగా విమర్శలు చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం లోని కొన్ని కీలక అంశాలు..

  • 2024 ఎన్నిక‌ల త‌ర్వాత కేంద్రంలో వచ్చేది మ‌న ప్ర‌భుత్వ‌మే, అది కూడా బీజేపీయేత‌ర ప్ర‌భుత్వమే రాబోతోంది.
  • అప్పుడు దేశవ్యాప్తంగా రైతులంద‌రికి నాణ్య‌మైన 24 గంట‌ల విద్యుత్ ను ఉచితంగా అందిస్తాం.
  • రైతు వ్య‌తిరేక బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగ‌నంపుదాం. దీనికోసం ప్రజలందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాలి.
  • ఈ దేశం కోసం తెలంగాణ నుంచి పోరాటం మొదలు పెట్టాలి, మరి దేశ రాజ‌కీయాల్లోకి పోదామా?
  • ప్ర‌పంచంలో ఏ దేశంలో లేనంతగా 83 కోట్ల ఎక‌రాల భూమి ఉంది.అందులో 41 కోట్ల ఎక‌రాలు వ్య‌వ‌సాయానికి అనువైనది.
  • కానీ దీనిని సద్వినియోగం చేసుకునే ఆలోచన బీజేపీ ప్రభుత్వానికి లేదు.
  • ఈ ఎనిమిదేళ్లలో కేంద్రం ఒక్క‌ పెద్ద రిజ‌ర్వాయ‌ర్ కానీ, ఒక్క ప్రాజెక్టు కానీ క‌ట్ట‌లేదు.
  • మన రైతాంగానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విషయాలలో అండగా ఉంటోంది.
  • వారికి కరెంటు, మంచినీళ్లు, సాగునీళ్లు, ఎరువులు, విత్తనాలు అందిస్తున్నాం. పంట చేతికొచ్చాక పొలంలోనే కొంటున్నాం.
  • బ్యాంకులు లూటీ చేసిన వారికి రూ.12లక్షల కోట్లు మాఫీ చేసింది ఈ బీజేపీ ప్రభుత్వం.
  • అలాంటప్పుడు రైతులకు ఇచ్చేందుకు రూ.1.45లక్షల కోట్లు లేవా?
  • గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతులు వాడిన కరెంటుకి మోటార్లు పెట్టమంటున్నారు.
  • బోరుకో మీటర్‌ పెట్టాలంటున్నారు. దీని వెనుక మతలబు ఏంది?
  • రైతుల భూములు కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించే కుట్ర జరుగుతోంది. దీనిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =