జార్ఖండ్ సంక్షోభం: అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం హేమంత్ సోరెన్, బల పరీక్షలో ఘనవిజయం

Jharkhand Crisis CM Hemant Soren Wins in Trust Vote While Tables Confidence Motion in Assembly Today, Jharkhand CM Hemant Soren Confidence Motion, Jharkhand Crisis Trust Vote, Jharkhand Assembly Confidence Motion, Jharkhand CM Hemant Soren, Mango News, Mango News Telugu, Trust Vote Confidence Motion, Jharkhand Crisis , Jharkhand Assembly, Hemant Soren Latest News And Updates, Jharkhand Crisis News And Live Updates, Jharkhand CM Hemant Soren Won Trust Vote

జార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. గత కొన్ని రోజులుగా అక్కడ జేఎంఎం సారధ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష బిజెపి తమ ఎమ్మెల్యేలను చీల్చే ప్రయత్నాన్ని తిప్పి కొట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకుంది. కాగా సోమవారం దీనికోసమే ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీ, కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే సీఎం సోరెన్ సభలో విశ్వాసపరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దీనిపై కొద్దిసేపు చర్చ అనంతరం నిర్వహించిన ఓటింగ్‌లో హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఘనవిజయం సొంత చేసుకుంది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో మెజారిటీకి 42 సీట్లు అవసరం కాగా, ఆయనకు అనుకూలంగా 48 ఓట్లు వచ్చాయి.

అయితే బలపరీక్ష నేపథ్యంలో.. అధికార పార్టీల (జేఎంఎం, కాంగ్రెస్)కు చెందిన చెందిన 30 మంది ఎమ్మెల్యేలు ఆదివారం ఛత్తీస్‌గఢ్‌ నుంచి బయలుదేరి రాంచీకి చేరుకున్నారు. కాగా ఆగస్ట్‌ 30వ తేదీ నుంచి రాయ్‌పూర్‌లోని ఓ రిసార్టులో వీరందరికీ ఆశ్రయం కల్పిస్తున్నారు. ఒక అక్రమ మైనింగ్ కేసులో ఆయనకు భాగముందని ఆరోపిస్తూ సీఎం హేమంత్ సోరెన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘంకు జార్ఖండ్ గవర్నర్‌ లేఖ రాయడంతో మొదలైన రాజకీయ సంక్షోభం నేటి పరిణామాలకు దారి తీసింది. కాగా దీనిపై స్పందించిన ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే గవర్నర్‌కు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ లేఖను పంపింది. దీంతో ఆయన ఏ క్షణమైనా సోరెన్‌పై తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఇక ఇటీవలే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం ఇలాగే అసెంబ్లీలో తన ప్రభుత్వంపై తానే విశ్వాస పరీక్ష పెట్టుకుని గెలివడం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + twelve =