ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం నాడు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) మరియు పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) అదనపు వాయిదాను విడుదల చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగులకు ఇచ్చే డీఏ ను, పెన్షనర్లకు ఇచ్చే డీఆర్ ను 4 శాతం పెంచారు. దీంతో అదనపు ఇన్‌స్టాల్‌మెంట్ ధరల పెరుగుదలను భర్తీ చేయడానికి ప్రాథమిక చెల్లింపు/పెన్షన్‌లలో ప్రస్తుతం ఉన్న 38 శాతం నుండి 4 శాతం పెరుగుదలతో 42 శాతంకు చేరింది. ఈ పెంపు జనవరి 1, 2023 నుండే వర్తిస్తుందని ప్రకటించారు.
మరోవైపు ఈ పెరుగుదల 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఆమోదించబడిన ఫార్ములర్‌కు అనుగుణంగా ఉంటుందని పేర్కొన్నారు. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) మరియు డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) రెండింటి కారణంగా ప్రభుత్వ ఖజానాపై ఉమ్మడి ప్రభావం సంవత్సరానికి రూ.12,815.60 కోట్లుగా ఉంటుందన్నారు. ఈ నిర్ణయం వలన దాదాపు 47.58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69.76 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. 2011 జులైలో 17 శాతంగా ఉన్న డీఏ, డీఆర్ ను ఒకేసారిగా 11 శాతం పెంచడంతో 28 శాతానికి చేరగా, 2021 అక్టోబర్ లో 3 శాతం, 2022 మార్చిలో 3 శాతం, 2022 సెప్టెంబర్ లో 4 శాతం, తాజాగా 4 శాతం పెంచడంతో 42 శాతానికి చేరుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE