నేడు ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహా ధర్నా.. పాల్గొననున్న బండి సంజయ్‌ సహా పలువురు నేతలు

Telangana BJP Chief Bandi Sanjay To Participate Day Long Nirudyoga Maha Dharna at Indira Park Hyderabad Today,Telangana BJP Chief Bandi Sanjay,Bandi Sanjay To Participate Day Long Maha Dharna,Nirudyoga Maha Dharna at Indira Park,Maha Dharna at Indira Park Hyderabad Today,Mango News,Mango News Telugu,BJP To Organise Day Long Nirudyoga Maha Dharna,TSPSC Paper Leak Case,Latest News on Hyderabads Indira Park,TSPSC Paper Leak Fires Up Opposition Parties,Telangana Nirudyoga Maha Dharna Latest News

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రం లీకేజీలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర బీజేపీ శనివారం నిరుద్యోగ మహాధర్నాకు సన్నద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో ఇందిరాపార్క్ వద్ద చేపడుతున్న ఈ ధర్నా 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ ధర్నా కొనసాగనుంది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను మంత్రివర్గం నుంచి తొలగించాలని ఈ సందర్భంగా బండి సంజయ్ డిమాండ్ చేయనున్నారు. అంతేకాకుండా ఈ వ్యవహారంలో నష్టపోయిన నిరుద్యోగులకు రూ.1లక్ష పరిహారం అందించాలని కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి బండి సంజయ్ కు ఇప్పటికే సిట్ నోటీసులు అందాయి. అయితే ఆయన సిట్ విచారణకు హాజరుకాలేదు.

ఇక ఈ మహాధర్నాకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర పదాధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. కాగా రాష్ట్ర బీజేపీ యువజన సంఘాలు, ప్రజా, విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే రాష్ట్రంలో మీడియా సంస్థలు, జర్నలిస్టులపై ప్రభుత్వం చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడేందుకు పార్టీ కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించిందని బీజేపీ రాష్ట్ర వర్గాలు తెలిపాయి. ఇక అంతకుముందు బీజేపీ తలపెట్టిన ఈ దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై శుక్రవారం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా దీక్షకు అనుమతి ఇచ్చిన హైకోర్టు.. కొన్ని ఆంక్షలను విధించింది. 500 మంది మాత్రమే ధర్నాలో పాల్గొనాలని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని సూచించిన హైకోర్టు సాయంత్రం 4 గంటలకు ధర్నా ముగించాలని స్పష్టం చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + eight =