ఎయిమ్స్ నుంచి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా డిశ్చార్జ్

AIIMS, AIIMS Delhi, Amit Shah Discharged, Amit Shah Discharged From AIIMS, Amit Shah Health, Amit Shah health news, Home Minister Amit Shah Discharged, Union Home Minister Amit Shah, Union Home Minister Amit Shah Discharged, Union Home Minister Amit Shah Discharged From AIIMS

కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా అనంతరం చికిత్స (పోస్ట్ కోవిడ్ కేర్) కోసం ఎయిమ్స్ లో చేరిన ఆయన పూర్తిగా కోలుకున్నారని, తిరిగి రోజువారీ కార్యక్రమాలు ప్రారంభించేందుకు సంసిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఎయిమ్స్ ఆసుపత్రి ఓ ప్రకటన విడుదల చేసింది.

ముందుగా ఆగస్టు 2వ తేదీన అమిత్‌షాకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ కావడంతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఆగస్టు 14 వ తేదీన నిర్వహించిన కరోనా పరీక్షల్లో అమిత్ షా కు నెగటివ్ గా వచ్చింది. కొద్దీ రోజుల అనంతరం అలసట మరియు శరీర నొప్పులు ఉండడంతో పోస్ట్ కోవిడ్ కేర్ చికిత్స కోసం ఎయిమ్స్ లో చేరారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో ఈ రోజు ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu