కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కు కరోనా నెగటివ్

amit shah, Amit Shah Tests Negative, Amit Shah Tests Negative for Covid-19, Coronavirus Cases, coronavirus cases india, coronavirus india, coronavirus india live updates, Coronavirus India News LIVE Updates, Union Home Minister, Union Home Minister Amit Shah

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కరోనా నుంచి కోలుకున్నారు. ఈ రోజు నిర్వహించిన కరోనా పరీక్షలో ఫలితం నెగెటివ్ గా వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “ఈ రోజు నా కరోనా పరీక్షలో ఫలితం నెగటివ్ గా వచ్చింది. దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరియు నేను త్వరగా కోలుకోవాలని ఆశీర్వదించిన వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వైద్యుల సలహా మేరకు మరికొన్ని రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండనున్నాను. కరోనాపై పోరాడటానికి నాకు సహాయం చేసిన మరియు నాకు చికిత్స చేసిన మేదాంత హాస్పిటల్ యొక్క వైద్యులు, పారామెడికల్ సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని” అమిత్ షా పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu