నగరంలో 150 మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా రెండో డోస్ వ్యాక్సినేషన్

10-day mobile vaccination drive begins in GHMC limits, 150 Mobile Vaccine Centres Set Up in GHMC For the Covid-19 Second Dose Vaccination, Covid-19 Second Dose Vaccination, GHMC For the Covid-19 Second Dose Vaccination, Mango News, Mobile vaccine centres, Mobile Vaccine Centres Set Up in GHMC, Mobile vaccine centres to cover 450 localities, Mobile vaccine centres to cover 450 localities in Greater Hyderabad area, Telangana CS visits mobile vaccination centre in Hyderabad

గ్రేటర్ హైదరాబాద్ లో నేటి నుండి ప్రారంభించిన రెండవ డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. నేడు నగరంలోని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని సన్ రైజ్ హోమ్ కాలనీలో ఏర్పాటుచేసిన మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాన్ని సీఎస్ సోమేశ్ కుమార్ పరిశీలించారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ లు కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీఎస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇప్పటికే మూడు కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ లను అందచేశామని తెలిపారు. కరోనా నివారణకు కేవలం వ్యాక్సిన్ తీసుకోవడమే మార్గమని పేర్కొన్నారు.

హైదారాబాద్ నగరంలో దాదాపు తొంభై శాతం పౌరులకు వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని, నేటి నుండి పది రోజులపాటు ఏర్పాటు చేసిన 150 మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా రెండో డోస్ ను వేయడం జరుగుతుందని వైద్య శాఖ కార్యదర్శి రిజ్వీ వివరించారు. అలాగే నగరంలో రెండు, మూడు కాలనీలకు ఒక ప్రత్యేక కేంద్రం వద్ద ఈ మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా రెండో డోస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ వివరించారు. ప్రతీ రోజూ దాదాపు 450 కాలనీలను కవర్ చేస్తామని అన్నారు. అవసరమైతే వాక్సినేషన్ కార్యక్రమాన్ని మరిన్ని రోజులు పొడగించనున్నట్టు లోకేష్ కుమార్ వివరించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =