మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Coronavirus Cases, coronavirus cases india, COVID-19, India Corona Updates, India Coronavirus, India Covid-19 Updates, Nitin Gadkari Tests Positive, total corona cases in india today, Total Corona Positive Cases in India, Union Minister Nitin Gadkari Tests Positive, Union Minister Nitin Gadkari Tests Positive for Covid-19, Union Minister Tests Positive

దేశంలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కరోనా బారినపడ్డారు. తాజాగా మరో కేంద్రమంత్రికి కరోనా సోకింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా స్వయంగా ప్రకటించారు.

“మంగళవారం కొంచెం నీరసంగా ఉండడంతో నా వైద్యుడిని సంప్రదించాను. చెకప్ సమయంలో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం అందరి ఆశీస్సులు మరియు శుభాకాంక్షలతో ఆరోగ్యంగానే ఉన్నాను. నిబంధనల ప్రకారం సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నాను. గత కొద్దీరోజులుగా నాతో కాంటాక్ట్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని మరియు కరోనా ప్రోటోకాల్‌ను అనుసరించాలని నేను అభ్యర్థిస్తున్నాను. క్షేమంగా ఉండండి” అని మంత్రి నితిన్‌ గడ్కరీ ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu