సెప్టెంబ‌ర్ 21 నుంచి 40 క్లోన్ స్పెష‌ల్ రైళ్లు నడపనున్న రైల్వే శాఖ

20 Pairs of Clone Special Trains from September 21, Indian Railways, Indian Railways Latest News, Indian Railways To Deploy 20 Pairs Of Clone Special Trains, Indian Railways to run 40 clone special trains, Indian Railways Updates, Ministry Of Railways, Ministry of Railways has Decided to Run 20 Pairs of Clone Special Trains, Railways to run 20 pairs of Clone Special trains, Railways to run 40 clone trains

రైలు ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ మరో శుభవార్త అందించింది. దేశంలోని కొన్ని ప్ర‌త్యేక రూట్ల‌లో రైళ్ల‌కు గ‌ల భారీ డిమాండును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని సెప్టెంబ‌ర్ 21 నుంచి 40 క్లోన్ స్పెష‌ల్ రైళ్లు న‌డ‌పాల‌ని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణ‌యించింది. ఇవి పూర్తిగా రిజ‌ర్వ్ డ్ బోగీల‌తో, ప్రకటించిన స‌మ‌యాల్లో మాత్ర‌మే న‌డుస్తాయి. అలాగే ఈ రైళ్లు కొన్ని స్టేష‌న్ల‌లోనే ఆగుతాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ 12 నుంచి కొత్తగా 80 ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ నడుపుతున్న సంగతి తెలిసిందే. వీటితో పాటుగా ఈ 40 క్లోన్ స్పెష‌ల్ రైళ్లు కూడా నడపనున్నారు.

ఈ రైళ్ల‌కు అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ కాల‌ప‌రిమితి 10 రోజులుంటుంది. ఈ రైళ్లు ప్రారంభంతో ఏపీ, తెలంగాణ ప్రజలకు కూడా ప్రయోజనం కలగనుంది. వీటిల్లో బెంగళూరు నుంచి దనాపూర్(06509), దనాపూర్ నుంచి బెంగళూరు(06510) వెళ్లే రైళ్లు విజయవాడ, వరంగల్ స్టేషన్లలో ఆగనున్నాయి. అలాగే సికింద్రాబాద్-దనాపూర్ (02787/02788) మార్గంలో కూడా క్లోన్ రైళ్లు నడవనున్నాయి.

40 క్లోన్ స్పెష‌ల్ రైళ్ల వివ‌రాలు:

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 14 =