సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్-2022 ఫలితాలను జూన్ 22, బుధవారం నాడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) విడుదల చేసింది. ముందుగా ఈ ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 5, 2022న నిర్వహించారు. సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్షలు రాసేందుకు మొత్తం 13,090 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్టు యూపీఎస్సీ వెల్లడించింది. ప్రిలిమ్స్ ఫలితాల ఆధారంగా మెయిన్స్ కు అర్హత సాధించిన వారి జాబితాను అధికారిక వెబ్సైట్ upsc.gov.in లో అందుబాటులో ఉంచారు.
ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన ఈ అభ్యర్థులందరూ పరీక్షా నిబంధనలకు అనుగుణంగా సివిల్ సర్వీసెస్ (మెయిన్)-2022 పరీక్ష కోసం వివరణాత్మక దరఖాస్తు ఫారమ్-I (డీఏఎఫ్-I)లో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్సీ తెలిపింది. డీఏఎఫ్-I మరియు దాని సమర్పణకు సంబంధించిన తేదీలు మరియు ముఖ్యమైన సూచనలు యూపీఎస్సీ వెబ్సైట్లో నిర్ణీత సమయంలో ప్రకటించబడతాయని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY