జూన్ 29న గుడివాడలో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

TDP Chief Chandrababu Naidu To Visit Gudivada on June 29, Chandrababu Naidu To Visit Gudivada on June 29, TDP Chief To Visit Gudivada on June 29, TDP Chief Chandrababu To Visit Gudivada on June 29, Nara Chandrababu Naidu To Visit Gudivada on June 29, TDP President Nara Chandrababu Naidu To Visit Gudivada on June 29, Nara Chandrababu Naidu Gudivada Tour, Chandrababu Naidu Gudivada Tour, TDP Chief Gudivada Tour, TDP President Nara Chandrababu Naidu, TDP Chief Chandrababu Naidu, Nara Chandrababu Naidu, Chandrababu Naidu, Nara Chandrababu Naidu Gudivada Tour News, Nara Chandrababu Naidu Gudivada Tour Latest News, Nara Chandrababu Naidu Gudivada Tour Latest Updates, Nara Chandrababu Naidu Gudivada Tour Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వచ్చేవారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా జూన్ 29వ తేదీన గుడివాడ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం గుడివాడలో ప్రకటించారు. మినీ మహానాడు, బహిరంగ సభలలో పాల్గొననున్నారు. చంద్రబాబు ఆరోజు నిర్వహించనున్న బహిరంగ సభ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఆయన నియోజకవర్గంలోని పరిధిలో పలు స్థలాలను వీక్షించారు.

ఈ క్రమంలో గుడ్లవల్లేరు, గుడివాడ మండలాల్లో నాలుగు ప్రాంతాలను కొల్లు రవీంద్ర పరిశీలించారు. కాగా ఈ నెల చివరి వారంలో గుడివాడలో జరుగనున్న మినీ మహానాడులో చంద్రబాబు పాల్గొంటారని, లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో పాల్గొనేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ఆసక్తి చూపుతున్నారని అన్నారు. అలాగే 30న మచిలీపట్నంలో కృష్ణా జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలపై చంద్రబాబు సమీక్ష చేపట్టనున్నారు. ఇక జులై 1వ తేదీన గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు, పొన్నూరు నియోజకవర్గాల్లో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here