నెల రోజుల్లో జో బైడెన్ పదవీ విరమణ.. వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా అధ్యక్షడు

US President Making Controversial Decisions, US President Making, Controversial Decisions, US President, US President News, US President Controversial Decisions, Controversial Decisions US President, Donald Trump, Joe Biden To Retire Within A Month, Us President Controversial Decisions, Us President Joe Biden, USA, US Election, US New President, America, National News, International News, Mango News, Mango News Telugu

అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ మరో నెల రోజుల్లోనే పదవీ విరమణ చేయనున్నారు. తన పదవీకాలం ముగుస్తున్న సమయంలో బైడెన్‌ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో నూతన అధ్యక్షుడిగా రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ భారీ మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

2025, జనవరి 20న ట్రంప్ నూతన అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టి.. 47వ అధ్యక్షుడిగా వైట్‌హైస్‌లో అడుగు పెట్టనున్నారు. ఇటు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ పదవీకాలం మరో 40 రోజుల్లో ముగియబోతోంది. ఈ సమయంలో బైడెన్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ఈమధ్య తన కొడుకుకు ఓ కేసులో క్షమాభిక్ష పెట్టిన జో బైడెన్‌.. ఇప్పుడు ఏకంగా మరో 39 మందికి క్షమాభిక్ష ప్రసాదించారు. అంతేకాకుండా 1,500 మంది ఖైదీల శిక్షాకాలాన్ని కూడా తగ్గించారు.

అమెరికా చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా జో బైడెన్ శిక్షాకాలాన్ని తగ్గించడం హాట్ టాపిక్ అయింది. క్షమాభిక్ష పొందినవారిలో ఎక్కువ మంది స్వలింగ సంపర్కులతో పాటు మాదక ద్రవ్యాల వినియోగం చేసేవాళ్లు ఉ న్నారు. అంతేకాదు హింసాత్మకం కాని నేరాల్లో దోషులుగా తేలి కొన్నాళ్లుగా శిక్షను అనుభవిస్తున్నవారికి క్షమాభిక్ష ప్రసాదించడమే ఇప్పుడు చర్చ నీయాంశం అయింది.

జోబైడెన్‌ ఒకేరోజు 1,500 మందికి శిక్షను తగ్గించడం అమెరికాలో సంచలనంగా మారింది. అమెరికా చరిత్రలోనే ఎన్నడూ ఇంత మందికి ఒకే రోజు శిక్ష తగ్గించలేదు. కానీ ఇప్పుడు బైడెన్‌ ఆ పనిచేశారు. కోవిడ్‌ సంక్షోభ సమయంలో కరోనా విజృంభించి జైలులో ఉన్న ఎక్కువ మంది ఖైదీలు వైరస్‌తో మృతిచెందారు. దీంతో అప్పుడు చాలా మంది ఖైదీలను బైడెన్‌ ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా వీరికే ఇప్పుడు శిక్ష తగ్గించారు.

కాగా ఇటీవలే బైడెన్‌ తన కొడుకుకు క్షమాభిక్ష పెట్టారు. అక్రమ ఆయుధాలు, తప్పుడు సమాచారం కేసులో బైడెన్ కొడుకుకు శిక్ష విధించిన కోర్టు.. ఇంకా దానిని ఖరారు చేయాల్సి ఉంది. అయితే బైడెన్‌ పదవీ విరమణకు రెండు నెలల మందు తన కొడుక్కి క్షమాభిక్షను ప్రసాదించారు. తాజాగా 39 మందికి కూడా కొత్తగా క్షమాభిక్ష పెట్టి.. 1,500 మంది శిక్ష తగ్గించి కొత్త రికార్డు సృష్టించారు.