ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు: అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 10 హామీలు ఇవే…

Delhi Municipal Corporation Elections Aam Aadmi Party's Chief CM Arvind Kejriwal Announces 10 Guarantees,Delhi Municipal Corporation Elections, Aam Aadmi Party's 10 Promises,Aam Aadmi Party,Mango News,Mango News Telugu,Arvind Kejriwal's 10 Promises For Delhi,Arvind Kejriwal Latest News And Updates,MCD Polls,BJP Releases Manifesto,MCD Polls Latest News And Updates,Arvind Kejriwal Launches AAP,AAP Party,AAP 10 Promises,Aam Aadmi Party Latest News And Updates,Aam Aadmi Party

ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు డిసెంబర్ 4వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 7న ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టి ఫలితాలను విడుదల చేయనున్నట్టు ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 250 వార్డులలో, 1.46 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ముఖ్యంగా అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీనెలకుంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించి ఢిల్లీవాసులకు ఆమ్ ఆద్మీ పార్టీ 10 హామీలు ఇచ్చింది. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియా సమావేశంలో 10 హామీలను ప్రకటించారు. ఇందులో అవినీతిని నిరోధించ‌డం, చెత్త డంపింగ్ యార్డుల త‌ర‌లింపు, పార్కింగ్ సమస్య నివారణ, విద్య‌, వైద్య స‌దుపాయాల మెరుగుపర్చడం వంటి హామీలు ఉన్నాయి. ఢిల్లీని అడ్డుకునే వారికి ఓట్లు వేయొద్దని, ఢిల్లీలో పనిచేస్తున్న వారికి, దేశాన్ని ముందుకు తీసుకెళ్లే వారికే ఓటు వేయండని కేజ్రీవాల్ ప్రజలను కోరారు.

ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు: అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 10 హామీలు ఇవే:

  • ఢిల్లీని శుభ్రంగా, అందంగా తీర్చిదిద్దడం, మూడు ల్యాండ్‌ఫిల్‌ల తోలగింపు, రోడ్లు శుభ్రం చేయడం.
  • ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ను అవినీతి రహితంగా మార్చడం, బిల్డింగ్ ప్లాన్‌లను ఆమోదించే ప్రక్రియ సులభతరం.
  • పార్కింగ్ సమస్యకు పరిష్కారం.
  • విచ్చలవిడి జంతువుల సమస్యను పరిష్కరించడం.
  • రోడ్లను మెరుగుపరచడం.
  • ఢిల్లీ కార్పొరేషన్ పరిధిలో పాఠశాలలు మరియు ఆసుపత్రులను మెరుగుపరచడం.
  • పార్కులను మెరుగుపరచడం మరియు ఢిల్లీని అందమైన పార్కుల నగరంగా మార్చడం.
  • తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేయడం, సక్రమంగా జీతాలు అందజేయడం.
  • వీధి వ్యాపారులకు క్లీన్ వెండింగ్ జోన్‌లు ఏర్పాటు చేయడం.
  • వ్యాపారులకు ఎలాంటి లంచం లేకుండా ఉచిత మరియు ఆన్‌లైన్‌లో లైసెన్స్‌లు అందించడం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + three =