పశుగ్రాసం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కి బెయిలు

Lalu Prasad Yadav Gets Bail In Fodder Scam,Fodder scam latest update, former Bihar chief minister Lalu in jail, Lalu bail, Lalu Prasad gets bail, Lalu Prasad Yadav Cases, Lalu Prasad Yadav Crime news, Lalu Prasad Yadav Granted Bail In Fodder Scam, Latest News on Fodder Scam, Mango News, RJD chief Lalu Prasad bail, RJD Fodder scam latest news

ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు రాంచీ హైకోర్టు శుక్రవారం,జూలై 12 న బెయిల్ మంజూరు చేసింది. పశుగ్రాసం కుంభకోణంలో కీలక పాత్రధారిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ కు చాలా ప్రయత్నాల తరువాత చివరికి ఈ రోజులో బెయిల్ లభించింది. దేయోఘర్ ఖజానా నుండి అధిక మొత్తంలో డబ్బును ఉపసంహరించుకోని, వినియోగించుకున్నందు వలన గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ ను కోర్టు ముద్దాయిగా పరిగణించి 3.5 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. రూ. 50,000 విలువ గల రెండు సెక్యూరిటీ ష్యురీటిలతో బెయిలుకు కు అనుమతి ఇచ్చారు. ఈ ఆదేశాలను జస్టిస్ అప్రేష్ కుమార్ వెల్లడించారు.

ప్రస్తుతానికి, లాలూ ప్రసాద్ యాదవ్‌పై పశుగ్రాసం కుంభకోనానికి సంబంధించిన కేసులే కాకుండా, మరికొన్ని కేసులు ఉండడంతో,ఇంకా కస్టడీ క్రిందే ఉండవలసి ఉంటుంది. ఇటీవల, బీహార్ కోర్టు మూడు వేర్వేరు కేసులలో అవినీతికి పాల్పడ్డారంటూ అతనికి జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం ఆరోగ్యం సరిగా లేకపోవడం, మరియు కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతుండడం వలన లాలూ ప్రసాద్ యాదవ్, రాంచీ లోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

[subscribe]
[youtube_video videoid=eNQ7u0jGdJI]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =