దేశవ్యాప్తంగా వందేభారత్ సేవలు విస్తరిస్తున్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్ లోని కాట్రా-సంగల్దాన్ సెక్షన్‌లో ప్రత్యేక వందే భారత్ ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ నెల 19వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్న ఈ రైలుకు.. మంగళవారం 272 కిలోమీటర్ల పొడవైన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గంలోని కాట్రా-సంగల్దాన్ సెక్షన్లో వందే భారత్ స్పెషల్ ట్రైన్ ను పరీక్ష విజయవంతం అయింది. ఈ ట్రైన్ వల్ల కాశ్మీర్‌ను దేశంలోని మిగిలిన ప్రాంతాలలో ప్రయాణించవచ్చు.
ప్రతిష్టాత్మక రైల్వే ప్రాజెక్ట్‌లోని కాట్రా-సంగల్దాన్ విభాగంలోకి వచ్చే ..చీనాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి ప్రారంభోత్సవానికి తుది సన్నాహాల్లో భాగంగా ఈ వందేభారత్ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఏప్రిల్ 15 వ తేదీన కాట్రా-సంగల్దాన్ విభాగంలో వందే భారత్ ప్రత్యేక రైలు ట్రయల్ రన్ నిర్వహించామని..అది విజయవంతం అయిందని అధికారులు తెలిపారు. తరువాత కాత్రా నుంచి జమ్మూకాశ్మీర్‌కు మొదటి రైలును జెండా ఊపి ప్రారంభిస్తామని తెలిపారు.
కాత్రా, బారాముల్లా మధ్య రైలు సర్వీసుల ప్రారంభమయ్యి.. కాశ్మీర్‌ను భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానిస్తుందని రైల్వే అధికారులు చెప్పారు. కాట్రా-సంగల్దాన్ సెక్షన్‌లోని ట్రాక్ నుంచి ముఖ్యమైన ప్రదేశాలతో పాటు కాశ్మీర్ వరకు కూడా మొత్తం ట్రాక్ వెంబడి బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రారంభోత్సవ రోజున అంటే ఏప్రిల్ 19న రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తాయని అన్నారు. శ్రీనగర్ నుంచి కాట్రాకు, కాట్రా నుంచి శ్రీనగర్‌కు రెండు వందేభారత్‌లు నడుస్తాయని తెలిపారు.