మరి కొన్ని రోజులు మధ్యవర్తిత్వమే,అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు

Ayodhya case SC extends mediation process, Ayodhya land title case Latest Updates, Mango News, SC Extends Ayodhya Mediation to July 31, SC Extends Mediation Process Till 31st July In Ayodhya Case, SC extends mediation till July 31 On Ayodhya Case, SC will hear Ayodhya dispute case on July 31

అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం కేసులో జూలై 31 వరకు మధ్యవర్తిత్వం కొనసాగించాలని కమిటీ ని సుప్రీం కోర్టు ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) రంజన్ గొగోయ్ మాట్లాడుతూ, ఆగస్టు 2 న విచారణ చేపట్టి, తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని,జూలై 31 నాటికి నివేదికను రూపొందించి ఆగస్టు 1న అందజేయాలని మధ్యవర్తిత్వ కమిటీకి ఆదేశాలు జారీ చేసారు. అయోధ్య వివాదాన్ని సామరస్యపూరితంగా పరిష్కరించే అవకాశాలు,మార్గాలు సూచించాలని 2019, మార్చి 8 న ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ని సుప్రీం కోర్టు నియమించింది. ఇందులో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఎఫ్.ఎం.ఖలీఫుల్లా, శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచు లను సభ్యులుగా నియమించింది.

మధ్యవర్తిత్వ విధానంలో పురోగతి లేదని,దాన్ని రద్దు చేసి న్యాయస్థానమే విచారణ చేపట్టాలని, సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు అవ్వగా,దానిపై జూలై 11 న విచారణ చేపట్టిన భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) రంజన్ గొగోయ్ తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం, మధ్యవర్తిత్వ కమిటీ లో జరిగిన పురోగతిని జూలై 18 నాటికీ నివేదిక సమర్పించాలని ఆదేశాలు ఇవ్వగా, కమిటీ నేడు నివేదిక సమర్పించింది. నివేదికను పరిశీలించిన ధర్మాసనం,మరికొంత సమయం అనగా జూలై 31 వరకు మధ్యవర్తిత్వం కొనసాగించాలని కమిటీని ఆదేశిస్తూ ఈ రోజు తీర్పు ఇచ్చింది.

 

[subscribe]
[youtube_video videoid=G0aRrPvVSII]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + eighteen =