ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Coronavirus, coronavirus cases india, coronavirus india, coronavirus india live updates, India Coronavirus, India Covid-19 Updates, Venkaiah Naidu Tests Positive, Venkaiah Naidu Tests Positive For Coronavirus, Vice President M Venkaiah Naidu, Vice President M Venkaiah Naidu Tests Positive, Vice President M Venkaiah Naidu Tests Positive For Coronavirus

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలిన విషయాన్ని ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. “మంగళవారం ఉదయం కరోనా పరీక్షలు చేయించుకోగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కు కరోనా పాజిటివ్‌ గా తేలింది. అయినప్పటికీ ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవు మరియు మంచి ఆరోగ్యంతో ఉన్నారు. వైద్యులు ఆయన్ను హోం క్వారంటైన్‌లోనే ఉండాలని సూచించారు. ఆయన సతీమణి ఉషా నాయుడుకి కరోనా పరీక్షల్లో ఫలితం నెగటివ్ వచ్చింది. ఆమె సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు” అని ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్విటర్‌లో పేర్కొంది. మరోవైపు ఈ రోజు ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 62,25,763 కు కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu