రాజధాని ఢిల్లీలో దృశ్యమానత సున్నా

Visibility In The Capital Delhi Is Zero, Visibility In Delhi, AQI, C.P.C.B, D.I.A.L, Delhi Airport, IMD, Air Pollution, AQI, Delhi Weather, GRAP, Winter, Air Pollution In Delhi, Delhi Air Pollution Increasing, Day By Day Delhi Pollution Increasing, Air Pollution In Delhi Is Increasing, AQI, Delhi Air Pollution, Delhi Pollution, Pollution, Delhi, Delhi Live Updates, Delhi Politics, National News, India, Congress, BJP, PM Modi, Live Updates, Breaking News, Live News, Mango News, Mango News Telugu

దేశ రాజధానిలోని చాలా ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు వల్ల కనీసం ఎదుటి మనిషిని కూడా చూడలేని పరిస్థితి కనిపిస్తోంది. దృశ్యమానత సున్నాగా మారిందని .. రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ శుక్రవారం చాలా పేలవమైన కేటగిరీలో నమోదైంది. 10 మానిటరింగ్ కేంద్రాల్లో 400కి మించి ఉండటంతో ఏక్యూఐ తీవ్రస్థాయికి చేరుకుంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి వచ్చిన డేటా ప్రకారం, ఢిల్లీలో 24 గంటల సగటు ఏక్యూఐ 371 వద్ద నమోదైంది. అంటే ఇది చాలా పేలవమైన విభాగంలోకి వస్తుందన్న మాట.

32 పర్యవేక్షణ కేంద్రాలలో 10 తీవ్రమైన విభాగంలో ఏక్యూఐ స్థాయిలు నమోదవడంతో వాతావరణ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాలో మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం, పట్‌పర్‌గంజ్, నెహ్రూ నగర్, ఓఖ్లా ఫేజ్ 2, పంజాబీ బాగ్, జహంగీర్‌పురి మొదలైనవి ఉన్నాయి. అంతేకాకుండా మిగిలిన కేంద్రాలలో కూడా గాలి నాణ్యత చాలా తక్కువగా ఉంది. ఢిల్లీలో గురువారం సగటు ఏక్యూఐ 318గా ఉంది. హస్తినలో గరిష్ట ఉష్ణోగ్రత 21.2 డిగ్రీల సెల్సియస్‌, సగటు కంటే 1.9 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయిందని ఐఎండీ తెలిపింది.

తీవ్రమైన పొగమంచు వల్ల శుక్రవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో 100కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. శనివారం 30 విమానాలు రద్దు కాగా, 150 విమానాలు ఆలస్యంగాఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో చాలా దట్టమైన పొగమంచు ఉందని, విజిబిలిటీ జీరో మీటర్ వద్ద నమోదైందని ఐఎండీ తెలిపింది. అన్ని రన్‌వేలు కూడా CAT-3 కింద పనిచేస్తున్నాయి.దీనివల్ల తక్కువ దృశ్యమాన పరిస్థితులలో కూడా విమానాలను టేకాఫ్ చేయడానికి ఇది అనుమతిస్తుంది.

ఇక ఢిల్లీలో శనివారం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంది. ఉదయం వాయువ్య దిశ నుంచి గంటకు నాలుగు కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో గాలులు వీశాయని వాతావరణ శాఖ తెలిపింది. చాలా ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఉండవచ్చని అంచనా వేసినట్లుగానే అయింది. శనివారం 30 విమానాలు రద్దు కాగా, 150 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కాగా విమానాలు రద్దు, ఆలస్యం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.