ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఇటీవలే ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు మరియు మదర్సాలలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసుల నిమిత్తం ట్యాబ్స్ ను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తక్కువ సమయంలో విద్యార్థులకు సరిపడా ట్యాబ్లెట్‌లు, స్మార్ట్ ఫోన్లను అందజేయడంలో కొంత ఇబ్బంది ఉన్న నేపథ్యంలో సీఎం మమతాబెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. 12వ తరగతి విద్యార్థులుకు అవసరమైన స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్స్ కొనుక్కునేందుకు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున అందజేస్తామని సీఎం మమతాబెనర్జీ వెల్లడించారు. విద్యార్థుల ఖాతాల్లోనే నేరుగా డబ్బులు జమచేస్తామని, ఆన్‌లైన్ క్లాసుల కోసం వాళ్లు ఆ డబ్బుతో స్మార్ట్ ఫోన్లు లేదా ట్యాబ్స్ కొనుక్కోవచ్చని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ