కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా ఇయాన్ మోర్గాన్, తప్పుకొన్న దినేశ్ కార్తీక్‌

Dinesh Karthik, Dinesh Karthik Hands Over Kolkata Knight Riders Captaincy, indian premier league, IPL 2020, IPL 2020 Highlights, IPL 2020 Latest Updates, IPL 2020 Live Cricket Score, IPL 2020 LIVE SCORE, IPL 2020 LIVE SCORE And Updates, IPL 2020 Live Updates, IPL 2020 Match 15 Live Score, IPL 2020 Match Dates, Kolkata Knight Riders, Kolkata Knight Riders Captaincy

ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2020 క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2020 ఇప్పటికే సగం మ్యాచులను పూర్తిచేసుకోగా, ఆసక్తికర మలుపులతో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు దినేశ్‌ కార్తీక్‌ సంచలన ప్రకటన చేశాడు. కెప్టెన్సీ తన బ్యాటింగ్ పై ప్రభావం చూపుతుందని, బ్యాటింగ్‌పై మరింత శ్రద్ద పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దినేశ్ కార్తీక్ వెల్లడించారు.

దీంతో కేకేఆర్ నూతన కెప్టెన్ గా ఇయాన్ మోర్గాన్ ను నియమించినట్టు జట్టు యాజమాన్యం ‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ అంశంపై కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ స్పందిస్తూ, దినేశ్ కార్తీక్ నిర్ణయంతో ఆశ్చర్యానికి గురయ్యామని పేర్కొన్నారు. అయితే అతడి నిర్ణయాన్ని గౌరవిస్తామని తెలిపారు. మరోవైపు ఇప్పటికి 7 మ్యాచులు ఆడిన కేకేఆర్ జట్టు నాలుగు విజయాలు సాధించి, 8 పాయింట్లు సాధించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here