‌అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ మార్లన్‌ శామ్యూల్స్

West Indies Batsman Marlon Samuels Announces Retirement from All Forms of Cricket

వెస్టిండీస్ సీనియర్ బ్యాట్స్‌మెన్ మార్లన్‌ శామ్యూల్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ఇస్తున్నట్లుగా బుధవారం నాడు శామ్యూల్స్ ప్రకటన చేశాడు. 2000వ సంవత్సరంలో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో కి అడుగుపెట్టిన శామ్యూల్స్‌, దాదాపు 18 సంవత్సరాలపాటుగా వెస్టిండీస్ క్రికెట్ కు సేవలు అందించాడు. ‌అన్ని ఫార్మాట్లలో కలిపి 11,134 పరుగులు చేసి‌ బ్యాటింగ్‌లో కీలకంగా నిలిచాడు. 2012, 2016 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ లను వెస్టిండీస్ గెలవడంలో మార్లోన్‌ శామ్యూల్స్‌ ప్రధాన పాత్ర పోషించాడు. రెండుసార్లు కూడా ఫైనల్స్ లో సత్తాచాటి జట్టు విజయానికి దోహదపడ్డాడు. ‌

వెస్టిండీస్ తరపున మొత్తం 207 వన్డేలు, 71 టెస్ట్‌లు, 67 టీ-20 మ్యాచుల్లో శామ్యూల్స్ ఆడాడు. 207 వన్డేల్లో 5606, 71 టెస్టుల్లో 3917, 67 టి-20 ల్లో 1611 పరుగులు చేశాడు. వన్డేల్లో 10, టెస్టుల్లో 7 సెంచరీలు చేశాడు. అలాగే పలు మ్యాచుల్లో బౌలింగ్ లో సైతం రాణిస్తూ అన్ని ఫార్మాట్లలో కలిపి 152 వికెట్లు తీశాడు. 2018 డిసెంబర్ లో చివరి మ్యాచ్ ఆడిన ‌శామ్యూల్స్‌ తాజాగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ