కుంభ మేళా అనేది హిందువులు జరుపుకునే సాంస్కృతిక పరమైన కార్యక్రమాల కోసం చేసే యాత్ర. సాధారణ కుంభ మేళా ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా ప్రతి ఆరేళ్లకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగలలో జరుగుతుంది. కానీ పూర్ణ కుంభ మేళా ప్రతి పన్నెండు ఏళ్లకు ఒకసారి ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లలో మాత్రమే జరుగుతుంది. పన్నెండు పూర్ణ కుంభ మేళాలు పూర్తయిన తరువాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్ లో మహా కుంభ మేళాను నిర్వహిస్తారు. అయితే ఈ మహా కుంభమేళ చరిత్ర చాలా ఆసక్తికరమైనది. మహా కుంభమేళాను ప్రతి ఏడాది కాకుండా 12 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. దేశంలోని నాలుగు ప్రాంతాల్లో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తారు. హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, నాసిక్, ఉజ్జయిని ప్రాంతాల్లో ఈ మహా కుంభమేళాను నిర్వహిస్తారు. చివరిసారిగా 2013లో ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా నిర్వహించారు మళ్లీ ఇప్పుడు 2025లో కుంభమేళాను నిర్వహించబోతున్నారు.
కుంభమేళా చరిత్ర సుమారు 850 ఏళ్ల నాటిదని పురాణాలు చెబుతాయి. కుంభమేళాను ఆదిశంకరాచార్యులు ప్రారంభించారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాలో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం కుంభమేళా నిర్వహణ అనేది గ్రహాల స్థానంతో సంబంధం కలిగి ఉంటుందట. అంటే కుంభరాశిలోకి బృహస్పతి ప్రవేశించినపుడు, మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించినపుడు కుంభమేళాను నిర్వహిస్తారు.
పన్నెండేళ్ల తర్వాత కుంభమేళా నిర్వహించడానికి ప్రధాన ఆధారం బృహస్పతి కదలికకు సంబంధించినది ఎందుకంటే బృహస్పతి ఒక రాశిలో దాదాపు పన్నెండు నెలల పాటు ఉండి, పన్నెండు ఏళ్లల్లో పన్నెండు రాశుల పర్యటనను పూర్తి చేసి తిరిగి అదే రాశిలోకి చేరుకుంటాడు. అంటే ఇలా గురువు పన్నెండేళ్ల క్రితం ఎక్కడ ఉన్నాడో పన్నెండేళ్ల తర్వాత అక్కడికే చేరుకుంటాడన్న మాట. అలా బృహస్పతిది పన్నెండేళ్ల సంచారంగా చెబుతారు.
సముద్ర మథనం ప్రారంభం నుంచి కుంభమేళా నిర్వహించబడుతుందని పురాణాలు చెబుతున్నాయి. దేవతలు , రాక్షసులు అంతా కలిసి తమ అమరత్వం కోసం అమృతాన్ని పొందడానికి సముద్రాన్ని మథనం చేసినప్పుడు.. ముందుగా హాలాహలం బయటపడింది. దానిని శివయ్య స్వీకరించి గరళ కంఠుడిగా మారిపోతాడు.
ఆ తర్వాత అమృతం రాగానే దేవతలు ఆ అమృతాన్ని స్వీకరించి అమరత్వాన్ని సొంతం చేసుకున్నారు. తమ వంతు వచ్చేసరికి అమృతం అయిపోతుందని గ్రహించిన రాక్షసులు దేవతలతో గొడవకు దిగుతారు.ఈ యుద్ధం 12 ఏళ్ల పాటు సాగుతుందట. ఈ యుద్ధ సమయంలో అమృత భాండం నుంచి 12 చోట్ల అమృతం చుక్కలు పడతాయట. వాటిలో ఎనిమిది స్వర్గంపై, నాలుగు భూమిపై పడ్డాయట. అలా మకరందం పడిన ఆ ప్రాంతాలు ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని , నాసిక్‌లలో కుంభమేళాను నిర్వహిస్తారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY