
ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారంటే.. దానికంటే ముందు ఆదాయ పన్ను ఊరట కోసం చాలామంది ఎదురుచూడటం సాధారణమే. అయితే,ఈ సారి ఈ ఎదురుచూపులు నిజం కాబోతున్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2024-2025 వ సంవత్సరం బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్సనల్ ట్యాక్స్ పేయర్స్‌కు ఊరటనిచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదాయ వర్గాల వారికి ట్యాక్స్ రేట్లను తగ్గించాలని ప్రభుత్వం అనుకుంటోన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వినియోగాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఎన్నికల సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారం చేపట్టడంతో జూలైలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రకటించనున్నారు. మోదీ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో గెలవకపోవడం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అంశాలపై వస్తున్న విమర్శలవల్ల ఆదాయ పన్ను రేట్ల తగ్గింపుపై కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలకు ఊరటనివ్వడానికి పైగా పొదుపును పెంచడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 15 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి ఊరట కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకోబోతోంది. ప్రస్తుతం రూ. 15 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి 5 నుంచి 20 శాతం ట్యాక్స్ ఉంది. అంతకంటే గరిష్ఠంగా 30 శాతం ట్యాక్స్ అమలవుతోంది.
అదే విధంగా రూ. 10 లక్షల ఇయర్లీ ఇన్కమ్ ఉన్న వారి ట్యాక్స్ రేట్లను కూడా తగ్గించే ప్రయత్నాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పన్ను రేట్లలో తగ్గింపు నిర్ణయం వల్ల వినియోగం పెరగడమే కాకుండా ఆర్థికవ్యవస్థలో డిమాండ్ పెరుతుంది. దీనివల్ల జీఎస్టీ ఆదాయం కూడా పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE