హెల్మెట్‌ పోయిందని కేసు పెట్టిన ఎల్‌ఎల్‌బీ స్టూడెంట్‌..!

Bengaluru LLB Student Files Complaint with Police After Losing Helmet,Bengaluru LLB Student Files Complaint,Complaint with Police After Losing Helmet,LLB Student Files Complaint,Mango News,Mango News Telugu,LLB student who filed a case of lost helmet,Sabari Surya, a youth, filed a complaint, Girinagar police station in Bengaluru,Bengaluru LLB Student Latest News,Bengaluru LLB Student Latest Updates,Bengaluru LLB Student Live Updates,Bengaluru News,Bengaluru Latest News and Updates

నా హెల్మెట్‌ను ఎవరో ఎత్తుకెళ్లారు వెతికిపెట్టండని బెంగళూరు పోలీసులకు ఓ యువకుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు షాక్ అయ్యారు. శబరి సూర్య అనే యువకుడు బెంగళూరులోని గిరినగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బెంగళూరులోని ద్వారకానగర్‌లోని జయదుర్గా బేకరీలో జ్యూస్ తాగేందుకు వెళ్లిన శబరి సూర్య అతని హెల్మెట్‌ను బండి దగ్గరే మర్చిపోయాడు. ఆ తర్వాత వెళ్లి చూసే సరికి హెల్మెట్ కనిపించలేదు. దీంతో గిరినగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఫిర్యాదులో తన హెల్మెట్ విలువ రూ.10 వేల రూపాయలు అని ఫిర్యాదుదారు శబరి సూర్య తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి హెల్మెట్‌ కోసం వేట ప్రారంభించారు. ఫిర్యాదుదారు శబరి సూర్య బెంగళూరులోని పీఈఎస్ కాలేజీలో ఎల్‌ఎల్‌బీ చదువుతున్నాడు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బేకరీ, ఆ బేకరి పక్కనే ఉన్న దుకాణాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ కేసు గురించి ఫిర్యాదుదారు సూర్య మీడియాతో మాట్లాడుతూ.. తాను హోసకెరహళ్లిలోని ద్వారకా నగర్‌లోని పీఈఎస్‌ కళాశాలలో బీబీఏ అండ్ ఎల్‌ఎల్‌బీ నాలుగవ సంవత్సరం చదువుతున్నానని, ప్రతిరోజు కాలేజ్‌కు వెళ్లి వస్తున్నానని వివరించాడు.

‘మధ్యాహ్నం 2.20 గంటల ప్రాంతంలో మా కాలేజీ సమీపంలోని ద్వారకా నగర్ రోడ్డులోని జయదుర్గా బేకరీ ఎదురుగా ఉన్న ఓ షాపు టేబుల్‌పై హెల్మెట్‌ను ఉంచి జ్యూస్ తాగేందుకు వెళ్లాను. హెల్మెట్ విలువ సుమారు 10 వేల రూపాయలు, కొందరు దొంగలు నా హెల్మెట్‌ను చోరీ చేశారు’ అని శబరి సూర్య ఆరోపించాడు.

అయితే పెరిగిపోతున్న జనాభాతో నేరాలు కూడా అంతే ఎక్కువగా పెరిగిపోవడంతో బెంగళూరు పోలీసులు పని ఒత్తిడితో సతమతం అవుతున్నారు. ఇలాంటి సమయంలో హెల్మెట్ పోయిందని ఓ కాలేజ్ విద్యార్థి కేసు పెట్టడంతో పోలీసులు షాక్ అయ్యారు. ఎల్ఎల్ బీ పూర్తి చేయకుండానే ఇలాంటి కేసు పెట్టిన శబరి సూర్య ..ఎల్ఎల్‌బీ పూర్తి చేసి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తే మంచి లాయర్ అవుతాడని అతని స్నేహితులు, నెటిజన్లు అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + ten =