ప్రముఖ కాఫీ దిగ్గజ సంస్థ ‘స్టార్‌బ‌క్స్’ కీలక నిర్ణయం.. నూతన సీఈఓగా భార‌త సంత‌తి వ్య‌క్తి లక్ష్మణ్ నరసింహన్ నియామకం

World Coffee Giant Starbucks Corp Appoints Indian Origin Laxman Narasimhan as New CEO, Starbucks New CEO Laxman Narasimhan, Coffee Giant Starbucks CEO Laxman Narasimhan, Starbucks Corp Appoints Indian Laxman Narasimhan as CEO, Starbucks Latest News And Updates, Starbucks CEO Laxman Narasimhan, Starbucks Coffee, Starbucks CEO Laxman Narasimhan, Indian Origin CEO Laxman Narasimhan, Mango News, Mango New Telugu, New CEO Laxman Narasimhan, Laxman Narasimhan Live News And Updates

భారతీయులకు గర్వకారణం అనిపించే మరో వార్త. ఇప్పటికే పలు ప్రపంచ స్థాయి సంస్థలకు భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు సీఈఓలుగా పనిచేస్తున్నారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తమ సంస్థలను ఉన్నత ప్రమాణాలతో ఆయా రంగాల్లో నెం.1గా నిలుపుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా ప్రపంచ ప్రముఖ కాఫీ దిగ్గజ సంస్థ అయిన స్టార్ బక్స్ కార్పొరేషన్ తమ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా భారత సంతతికి చెందిన వ్యక్తి లక్ష్మణ్ నరసింహన్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. స్టార్ బక్స్ ప్రస్థుత సీఈఓ హోవార్డ్ సూహుల్ట్‌జ్ స్థానంలో 55 ఏళ్ల నరసింహన్ అక్టోబరు 1వ తేదీ నుంచి సీఈఓగా బాధ్యతలు స్వీకరించనుండగా, హోవార్డ్ స్క‌ల్జ్ 2023 ఏప్రిల్ వ‌ర‌కు ఆ కంపెనీ తాత్కాలిక చీఫ్‌గా కొన‌సాగుతారు.

ఇక గ‌తంలో నరసింహన్‌కు ‘లైసాల్ అండ్ ఎన్‌ఫామిల్’ బేబీ ఫార్ములా కంపెనీలో సీఈవోగా పనిచేసిన అనుభవం ఉంది. అయితే ప్ర‌స్తుతం లండ‌న్‌లో వుంటున్న నరసింహన్ స్టార్‌బ‌క్స్ సంస్థలో పనిచేయటానికి సియాటిల్ వెళ్ల‌నున్నారు. ఈ నేపథ్యంలో.. స్టార్‌బ‌క్స్ ఆయన రాకను ఉద్దేశించి, త‌మ కంపెనీకి రాబోయే సీఈవో అసాధార‌ణ వ్య‌క్తి అని, అలాగే ట్యాలెంట్ ఉన్న లీడ‌ర్ అని పేర్కొంది. ఈ మేరకు స్టార్‌బ‌క్స్ బోర్డు చైర్ వుమెన్ మెల్లోడీ హాబ్స‌న్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఇప్పటికే పలు ఇతర ప్రముఖ సంస్థలకు భారత మూలాలున్న వ్యక్తులు సీఈఓలుగా వ్యవహరిస్తున్న వారు.. ‘గూగుల్’ సీఈఓగా సుందర్ పిచాయ్, ‘మైక్రోసాఫ్ట్’ సీఈఓగా సత్య నాదెళ్ల, ‘ఐబీఎం’ సీఈఓగా అరవింద్ కృష్ణ, ‘ట్విట్టర్’ సీఈఓగా పరాగ్ అగర్వాల్, ‘బాటా’ సీఈఓగా సందీప్ కటారియా, ‘వీఎం వేర్’ సీఈఓగా రఘురాం, ‘అడోబ్’ సీఈఓగా శంతను నారాయణ్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 10 =