ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2023 వేలం: 5 ప్రాంఛైజీలు కొనుగోలు చేసిన క్రికెటర్ల జాబితా ఇదే…

WPL 2023 Auction Full List of Players Bought by the 5 Franchises,Women’s Premier League-2023,Women’s Premier League,Women’s Premier League Auction,Mango News,Mango News Telugu,IPL-2023 Mini Auction, 714 Indian IPL Auction, 277 Foreign Players IPL Auction,Total 991 Players in IPL Mini Auction,IPL Mini Auction 2023,IPL Mini Auction,IPL Mini Auction Latest News and Updates,IPL Mini Auction News and Live Updates,Mango News,Mango News Telugu,IPL 2023 Player Auction,IPL Player Auction,IPL Player Auction 2023,IPL 2023,IPL News and Updates

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2023 వేలం పక్రియ ఫిబ్రవరి 13, సోమవారం ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌ లో జరిగింది. ప్రారంభ డబ్ల్యూపీఎల్-2023 లో ఆడేందుకు మొత్తం 409 మంది ఆటగాళ్లు వేలంలో ఉండగా, 5 ఫ్రాంచైజీలు కలిపి 87 మంది క్రికెటర్లను కొనుగోలు చేశాయి. వీరిలో 57 మంది భారత్ ఉమెన్ క్రికెటర్లు కాగా, 30 మంది విదేశీ ఉమెన్ క్రికెటర్లు ఉన్నారు. డబ్ల్యూపీఎల్-2023 వేలంలో క్రికెటర్ల కోసం 5 ఫ్రాంచైజీలు కలిసి రూ.59.50 కోట్లు ఖర్చు చేశాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్ జెయింట్స్ 18 మందిని చొప్పున, ముంబయి ఇండియన్స్ 17 మందిని, యూపీ వారియర్స్ 16 మందిని కొనుగోలు చేశాయి.
.

అత్యధిక ధర పలికిన ఐదుగురు క్రికెటర్లు:

కాగా వేలంలో భారత్ మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన రూ.3.40 కోట్లతో చరిత్ర సృష్టించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ.3.40 కోట్లుకు దక్కించుకోవడంతో డబ్ల్యూపీఎల్‌ ప్రారంభ సీజన్‌లో అత్యధిక ధరకు ఎంపికైన మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధాన నిలిచింది
అలాగే ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ ఆష్లీ గార్డనర్‌ ను గుజరాత్‌ జెయింట్స్‌ రూ.3.20 కోట్లకు, ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ నాట్ స్కివర్‌ ను ముంబయి ఇండియన్స్ రూ.3.20 కోట్లకు, భారత్ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మను యూపీ వారియర్స్‌ రూ.2.60 కోట్లకు, భారత్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ.2.20 కోట్లకు దక్కించుకున్నాయి.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2023 వేలం: 5 ప్రాంఛైజీలు కొనుగోలు చేసిన క్రికెటర్ల జాబితా:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:

  1. స్మృతి మంధాన – రూ. 3.4 కోట్లు
  2. సోఫీ డివైన్ (న్యూజిలాండ్) – రూ.50 లక్షలు
  3. ఎల్లీస్ పెర్రీ (ఆస్ట్రేలియా) – రూ.1.7 కోట్లు
  4. రేణుకా సింగ్ – రూ.1.5 కోట్లు
  5. రిచా ఘోష్ – రూ.1.9 కోట్లు
  6. ఎరిన్ బర్న్స్ (ఆస్ట్రేలియా) – రూ.30 లక్షలు
  7. దిశా కసత్ – రూ.10 లక్షలు
  8. ఇంద్రాణి రాయ్ – రూ.10 లక్షలు
  9. శ్రేయాంక పాటిల్ – రూ.10 లక్షలు
  10. కనికా అహుజా – రూ.35 లక్షలు
  11. ఆశా శోభన – రూ.10 లక్షలు
  12. హీథర్ నైట్ (ఇంగ్లాండ్) – రూ.40 లక్షలు
  13. డేన్ వాన్ నీకెర్క్ (సౌతాఫ్రికా) – రూ.30 లక్షలు
  14. ప్రీతి బోస్ – రూ.30 లక్షలు
  15. పూనమ్ ఖేమ్నార్ – రూ.10 లక్షలు
  16. కోమల్ జంజాద్ – రూ.25 లక్షలు
  17. మేగాన్ షట్ (ఆస్ట్రేలియా) – రూ.40 లక్షలు
  18. సహానా పవార్ – రూ.10 లక్షలు

ఢిల్లీ క్యాపిటల్స్:

  1. జెమిమా రోడ్రిగ్స్ – రూ.2.2 కోట్లు
  2. మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా) – రూ.1.1 కోట్లు
  3. షఫాలీ వర్మ – రూ.2 కోట్లు
  4. రాధా యాదవ్ – రూ.40 లక్షలు
  5. శిఖా పాండే – రూ.60 లక్షలు
  6. మారిజానే కాప్ (సౌతాఫ్రికా) – రూ.1.5 కోట్లు
  7. టిటాస్ సాధు – రూ.25 లక్షలు
  8. ఆలిస్ క్యాప్సీ (ఇంగ్లాండ్) – రూ.75 లక్షలు
  9. తారా నోరిస్ (యూఎస్ఏ) – రూ.10 లక్షలు
  10. లారా హారిస్ (ఆస్ట్రేలియా) – రూ.45 లక్షలు
  11. జసియా అక్తర్ – రూ.20 లక్షలు
  12. మిన్ను మణి – రూ.30 లక్షలు
  13. తానియా భాటియా – రూ.30 లక్షలు
  14. పూనమ్ యాదవ్ – రూ.30 లక్షలు
  15. జెస్ జోనాసెన్ (ఆస్ట్రేలియా) – రూ.50 లక్షలు
  16. స్నేహ దీప్తి – రూ.30 లక్షలు
  17. అరుంధతి రెడ్డి – రూ.30 లక్షలు
  18. అపర్ణ మండల్ – రూ.10 లక్షలు

ముంబయి ఇండియన్స్:

  1. హర్మన్‌ప్రీత్ కౌర్ – రూ.1.8 కోట్లు
  2. నాట్ స్కివర్-బ్రంట్ (ఇంగ్లాండ్) – రూ.3.2 కోట్లు
  3. యాస్తిక భాటియా – రూ.1.5 కోట్లు
  4. అమేలియా కెర్ (న్యూజిలాండ్) – రూ.1 కోటి
  5. పూజా వస్త్రాకర్ – రూ.1.9 కోట్లు
  6. హీథర్ గ్రాహం (ఆస్ట్రేలియా) – రూ.30 లక్షలు
  7. ఇస్సాబెల్ వాంగ్ (ఇంగ్లాండ్) – రూ.30 లక్షలు
  8. అమంజోత్ కౌర్ – రూ.50 లక్షలు
  9. ధారా గుజ్జర్ – రూ.10 లక్షలు
  10. సైకా ఇషాక్ – రూ.10 లక్షలు
  11. హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్) – రూ.40 లక్షలు
  12. క్లో ట్రయాన్ (సౌతాఫ్రికా) – రూ.30 లక్షలు
  13. హుమైరా కాజీ – రూ.10 లక్షలు
  14. ప్రియానక బాల – రూ.20 లక్షలు
  15. సోనమ్ యాదవ్ – రూ.10 లక్షలు
  16. నీలం బిష్త్ – రూ.10 లక్షలు
  17. జింతామణి కలిత – రూ.10 లక్షలు

గుజరాత్ జెయింట్స్

  1. ఆష్లీ గార్డనర్ (ఆస్ట్రేలియా) – రూ. 3.2 కోట్లు
  2. బెత్ మూనీ (ఆస్ట్రేలియా) – రూ.2 కోట్లు
  3. సోఫియా డంక్లీ (ఇంగ్లాండ్) – రూ.60 లక్షలు
  4. అన్నాబెల్ సుథర్లాండ్ (ఆస్ట్రేలియా) – రూ.70 లక్షలు
  5. డియాండ్రా డాటిన్ (వెస్టిండీస్) – రూ.60 లక్షలు
  6. స్నేహ రానా – రూ.75 లక్షలు
  7. సబ్బినేని మేఘన – రూ.30 లక్షలు
  8. జార్జియా వేర్‌హామ్ (ఆస్ట్రేలియా) – రూ.75 లక్షలు
  9. మాన్సీ జోషి – రూ.30 లక్షలు
  10. దయాళన్ హేమలత – రూ.30 లక్షలు
  11. మోనికా పటేల్ – రూ.30 లక్షలు
  12. తనూజా కన్వర్ – రూ.50 లక్షలు
  13. సుష్మా వర్మ – రూ.60 లక్షలు
  14. హర్లీన్ డియోల్ – రూ.40 లక్షలు
  15. హర్లీగాలా – రూ.10 లక్షలు
  16. అశ్వని కుమారి – రూ.35 లక్షలు
  17. పరునికా సిసోడియా – రూ.10 లక్షలు
  18. షబ్నం షకీల్ – రూ.10 లక్షలు

యూపీ వారియర్స్

  1. సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లాండ్) – రూ.1.8 కోట్లు
  2. దీప్తి శర్మ – రూ.2.6 కోట్లు
  3. తహ్లియా మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా) – రూ.1.4 కోట్లు
  4. షబ్నిమ్ ఇస్మాయిల్ (సోతాఫ్రికా) – రూ.1 కోటి
  5. అలిస్సా హీలీ (ఆస్ట్రేలియా) – రూ.70 లక్షలు
  6. అంజలి శర్వాణి – రూ.55 లక్షలు
  7. రాజేశ్వరి గయక్వాడ్ – రూ. 40L
  8. పార్షవి చోప్రా – రూ.10 లక్షలు
  9. శ్వేతా సెహ్రావత్ – రూ.40 లక్షలు
  10. ఎస్.యశశ్రీ – రూ.10 లక్షలు
  11. కిరణ్ నవ్‌గిరే – రూ.30 లక్షలు
  12. గ్రేస్ హారిస్ (ఆస్ట్రేలియా) – రూ.75 లక్షలు
  13. దేవికా వైద్య – రూ.1.4 కోట్లు
  14. లారెన్ బెల్ (ఇంగ్లాండ్) – రూ.30 లక్షలు
  15. లక్ష్మీ యాదవ్ – రూ.10 లక్షలు
  16. సిమ్రాన్ షేక్ – రూ.10 లక్షలు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE