‘నో’ చెప్పడం మీకు వచ్చా? అయితే జీవితంలో సగం గెలిచినట్లే..

There are times when you can't say no,Can you say 'no',Say No

‘నో’ అనేది ఒక్క పదమే కానీ..చెప్పడం మాత్రం కొందరికి చాలా కష్టం. నిజంగానే ‘నో ’చెప్పలేని సందర్భాలు (There are times when you can’t say no) చాలా ఉంటాయి. అయినా మీకు ఇబ్బంది అనిపించినప్పుడు కూడా అవతలి వాళ్లు ఏమనుకుంటారోనని, అవతలి వారిని సంతోషపెట్టాలని నో చెప్పలేకపోవడం చాలా తప్పు. అలా చేయడం వల్ల ఒక్కోసారి కోలుకోలేని దెబ్బ తినాల్సి కూడా వస్తుంది.

అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలనే సామెతను ఎప్పుడూ మైండ్‌లో పెట్టుకోవాలి. ఎస్ చెప్పి.. అవతలివారికి మాటిచ్చాక ఆ పని చేయలేక.. పడే ఇబ్బంది కంటే ముందే నో చెప్పడం ఎంతో మంచిది. అలా చెప్పడం వల్ల మొదటిలో తప్పు చేసిన భావన ఉంటుంది. కానీ జీవితంలో విజయాన్ని సాధించాలంటే.. నలుగురు మెచ్చుకునేలా ఏదో ఒక దశకు చేరుకోవాలంటే మాత్రం ‘నో’ అని కొన్నిసార్లు అయినా చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే వారికి మాటివ్వడం వల్ల అదే మీ గోల్‌కు అడ్డంకి (Obstacle to goal)గా మారొచ్చు. మీ లక్ష్య సాధనకు కావాల్సిన సమయాన్ని కేటాయించలేరు. దీనివల్ల జీవితంలో చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే కాస్త కష్టమైన ‘నో’ ఎలా చెప్పాలి

చాలామందిలో ఒక డౌట్ వస్తూ ఉంటుంది.. అవతలి వాళ్లు తన విషయంలో చాలా సార్లు ఈజీగా నో చెప్పేస్తుంటారు..మరి నేనెందుకు చెప్పలేకపోతున్నాను అని. అయితే దీన్ని రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. మొదటది మన పర్సనల్ లైఫ్ (Personal life). మన లైఫ్‌లో కొన్నిసార్లు ‘నో’ అని చెప్పడానికి సిగ్గుపడతాం. ఇలాంటివాళ్లు స్వభావరీత్యా కాస్త భయస్తులు అయి ఉంటారు. ఎవరితోనైనా ‘నో’ చెబితే ఎదుటి వ్యక్తి బాధ పడతాడేమోనని భయపడతారు. అతని ఏమనుకుంటాడో అని అదేపనిగా ఆలోచిస్తూ మనం కలత చెందుతారు. అందుకే అలా ఆలోచిస్తూ తమ మనసును, కోరికను తామే చంపుకుని ఎదుటి వ్యక్తితో నో చెప్పడం కంటే ఎస్ అని చెప్పడమే బెటరనుకుంటారు.

ఇక రెండవది మన ప్రొఫెషనల్ లైఫ్ (Professional life).. మామూలుగానే ‘నో’ చెప్పలేని వ్యక్తులు ఇక్కడ కూడా అదే చేస్తారు. భయంతో ‘నో’ చెప్పలేక మౌనంగా ఉంటారు. ఒకవేళ నో చెబితే అది మనసులో పెట్టుకుని తమ ఉద్యోగంలో ఆటంకాలు కలిగిస్తారేమోనని ఆలోచిస్తారు. ఫ్యూచర్‌లో కూడా ఒకే ఆఫీస్‌లో పని చేస్తారు కాబట్టి.. అతనితో పని చేసినప్పుడు అది మనసులో పెట్టుకుని తన గురించి పక్కవారికి చెడ్డగా చెబుతారేమో అని అనుకుంటారు. అందుకే ఎదుటి వ్యక్తి తనను వాడుకుంటున్నారని తెలిసి కూడా నో చెప్పలేక తనలో తానే మదనపడుతుంటారు. అయితే అనవసర త్యాగాలు చేసి మరీ వాళ్లకు పనులు చేసి పెట్టినా.. ఒకసారి నిజంగానే మనం చేయలేని పరిస్థితుల్లో ‘నో’ చెబితే.. ఇదే పట్టుకుని హైలెట్ చేసే మనుష్యులు ఉంటారు అనే విషయాన్ని మరచిపోతారు.

ఈ రెండింటిలోనూ అంటే.. పర్సనల్ లైఫ్‌లో అయినా. ప్రొఫెనల్ లైఫ్‌లో అయినా ‘నో’ చెప్పగలిగిన వాడే జీవితంలో సక్సెస్ అవుతాడు. ఎందుకంటే అప్పుడే తన గోల్ కోసం కావాల్సిన సమయాన్ని ఇచ్చి విజయాన్ని సాధిస్తాడు. ఒక్కోసారి డబ్బుల విషయంలోనూ , టైమ్ విషయంలోనూ చాలా సార్లు మోసపోవాల్సి వస్తుంది. అందుకే మీకు ఎవరైనా పని చెప్పినప్పుడు.. లేదా ఎవరితోనైనా మాట్లాడినప్పుడు నష్టపోతాం అని ఏమాత్రం అనిపించినా.. ‘నో’ చెప్పడానికి అస్సలు సంకోచించకండి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE