76 శాతం రూ.2000 నోట్లు వెనక్కి వచ్చాయట

RBI Announces 76% of Rs 2000 Notes in Circulation Have Returned to Banks,RBI Announces 76% of Rs 2000 Notes,RBI 2000 Notes in Circulation,2000 Notes Have Returned to Banks,Mango News,Mango News Telugu,2000 Notes In Circulation Have Been Returned,2000 notes returned by users to banks,Notes In Circulation Have Been Returned,2000 denomination notes in circulation,2000 Notes Circulation Latest News,2000 Notes Circulation Latest Updates,RBI 2000 Notes Latest News,RBI 2000 Notes Latest Updates,RBI 2000 Notes Live News,RBI 2000 Notes Circulation News Today

కేంద్రప్రభుత్వం 2016లో పెద్దనోట్లు రద్దు (Abolition of big notes) అయినప్పుడు..చలామణిలోకి వచ్చింది రూ. 2000 నోటు. మే 19 న మరోసారి రూ. 2000 నోటును కూడా రద్దు (Rs. 2000 note also scrapped) చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఆ నోట్లు తిరిగి బ్యాంకులకు ఇచ్చి మార్చుకోవచ్చని.. లావాదేవీలు కూడా జరుపుకోవచ్చని కాకపోతే సెప్టెంబర్ వరకూ మాత్రమే ఈ గడువు అని తేల్చి చెప్పింది. దీంతో చాలామంది రూ. 2000 నోటును మార్చుకునే పనిలో పడ్డారు. అలా తిరిగివచ్చిన నోట్లు 76శాతం ఉన్నాయని ఆర్బీఐ వెల్లడించింది.

నిజానికి 2016లో పెద్దనోట్ల రద్ద తర్వాత అంటే 2018-19లో రూ. 2,000 నోట్ల ముద్రణను పూర్తిగా నిలిపివేసింది. మే 19న ఉపసంహరణ ప్రకటన సమయంలో కూడా బ్యాంకులకు వచ్చే కస్టమర్లకు రూ.2వేల నోట్లు (Rs.2000 notes ) ఇవ్వొద్దని అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకోవడానికి.. సెప్టెంబరు 30 వరకు గడువు ఉందని.. ఆ లోపు నోట్లను మార్చుకోవాలని ఆర్‌బీఐ మరోసారి గుర్తు చేసింది. 2016లో రూ.1000, రూ.500 నోట్ల రద్దు చేశాక రూ.2వేల నోట్ల (Rs.2000 notes)ను బీజేపీ సర్కార్‌ ప్రవేశపెట్టింది. అయితే ఇప్పుడు మళ్లీ ఆ నోట్లను తిరిగి ఎందుకు ఉపసంహరించుకుందనే విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.

తాజాగా ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్ల (Rs.2000 notes)లో.. 76 శాతం కరెన్సీని ఉపసంహరించుకున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Reserve Bank of India) చెప్పింది. రూ. 2వేల నోటును వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్రప్రభుత్వం.. మే 19న ప్రకటించగా… 2023 జూన్‌ 30 నాటికి బ్యాంక్‌లకు తిరిగి వచ్చిన మొత్తం రూ. 2వేల రూపాయల నోట్ల మొత్తం విలువ రూ.2.72 లక్షల కోట్లు అని ఆర్బీఐ తెలిపింది. మార్చి 31 నాటికి రూ.3.62 లక్షల కోట్ల పెద్దనోట్లు చలామణిలో ఉన్నట్లు ఆర్బీఐ చెప్పింది. అయితే మే 19 నాటికి రూ.3.56 లక్షల కోట్లు చెలామణిలో ఉండగా.. ఇప్పటి వరకు 76 శాతం రిటర్న్‌ వచ్చేసాయని తెలిపింది.

అలాగే మే 1 నాటికి మార్కెట్‌లో ఇంకా రూ.84,000 కోట్ల విలువ చేసే రూ.2వేల నోట్లు చెలామణిలో ఉన్నాయి. అలా తిరిగి వచ్చిన రూ. 2,000 (Rs.2000 notes) మొత్తం నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలో ఉండగా.. మిగిలిన 13 శాతం ఇతర డినామినేషన్‌ నోట్లలోకి మార్పిడి జరిగిందని రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =