సిటీ లేదు మారు మూల గ్రామం లేదు అందరికీ ఇప్పుడు వాట్సాప్ కామన్ యాప్ అయిపోయింది. చిన్న పిల్లల నుంచి ముసలివాళ్లు వరకూ వాట్సాప్ లోనే కాలం గడిపేస్తున్నారు. చివరకు స్కూలు , బ్యాంకు, ఆఫీసు, స్కీములు ఇలా ఏదయినా సరే వాట్సాప్ లోనే మనకు కావాల్సిన సమాచారం తెలుసుకునే అవకాశం ఉండటంతో వాట్సాప్‌తో లేకుండా ఏ పని జరగదు అన్నట్లు పరిస్థితి మారిపోయింది. అయితే, ఎక్కువ సంఖ్యలో ఫైల్స్, ఫోటోలు, గ్రూప్ చాట్ హిస్టరీ పేరుకుపోవడంతో వాట్సాప్ స్టోరేజీ నిండిపోతుంది. దీనివల్ల ఒక్కోసారి ఫోన్ కూడా హ్యాంగ్ అవుతుంది.
అందుకే ఎప్పటికప్పుడు స్టోరేజీ క్లియర్ చేయాలంటున్నారు నిపుణులు. ముందుగా స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి..కుడి వైపు ఉండే మూడు చుక్కల మీద క్లిక్ చేయాలి.సెట్టింగ్స్ ఆప్షన్‌పై క్లిక్ చేసి..తర్వాత స్టోరేజ్ అండ్ డేటాకు వెళ్లాలి. స్టోరేజ్ మేనేజ్ ఆప్షన్‌పై క్లిక్ చేశాక.. డేటాను ఫిల్టర్ చేసి, ఎక్కువ స్టోరేజ్ తీసుకుంటున్న చాట్లు లేదా ఛానెల్‌లను సెలక్ట్ చేసుకుని..ఐటమ్స్ డిలీట్ చేయిపై క్లిక్ చేయాలి
మొబైల్లో ఒకే ఫోటో లేదా వీడియో చాలా కాపీలు సేవ్ అయి ఉంటే, స్పేస్ కోసం అన్ని కాపీలను డిలీట్ చేయాలి. డూప్లికేట్ ఫైల్స్ ఆప్షన్ లో.. డూప్లికేట్ ఫైల్స్‌ను చూసి డిలీట్ చేయొచ్చు. వాట్సాప్ నుంచి అవసరం లేని అన్ని మీడియా ఫైల్స్‌ను డిలీట్ చేయాలి. ఈ ఆప్షన్ కూడా గ్యాలరీలో అందుబాటులో ఉంటుంది.
అలాగే వాట్సాప్ స్టోరేజ్ ఎక్కువగా చాట్ హిస్టరీ వల్ల నిండిపోతుంది కాబట్టి.. క్లియర్ చేయడానికి చాట్ హిస్టరీని డిలీట్ చేయాలి. దీని కోసం సంబంధిత చాట్‌ను ఓపెన్ చేసి.. కుడి వైపు ఉండే మూడు చుక్కలపై క్లిక్ చేయాలలి. మీరు చాట్‌లో సెట్టింగ్స్ ఆప్షన్‌కు కూడా వెళ్లి..ఇప్పుడు మోర్ పై క్లిక్ చేస్తే క్లియర్ చాట్ హిస్టరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి చాట్ హిస్టరీని డిలీట్ చేయాలి. గ్రూప్ చాట్లలో ఎక్కువ ఫోటోలు, వీడియోలు, చాట్లు ఉంటాయి. వాటిని సమయానుసారంగా డిలీట్ చేసి.. ఫోన్ లో స్పేస్ పొందొచ్చు.