బరువు పెరిగిన వాళ్లకు, అనారోగ్యం పాలైన వాళ్లకు, డైట్ ఫాలో అయిన వాళ్లకు ఫ్రూట్స్ ఓ వరం లాంటివనే చెప్పొచ్చు. అందుకే డాక్టర్లు, న్యూట్రిషనిస్ట్ లు ఇచ్చే మెనూ లిస్ట్ లో ఫ్రూట్స్ తప్పనిసరిగా ఉంటాయి. ఈజీగా డైజస్ట్ అవడంతో పాటు కావల్సిన పోషకాలు ఉండటంతో చాలా మంది పండ్లకే తమ ఓటేస్తారు. రకరకాల పండ్లు తినటానికి అందులోనూ సీజనల్ ఫ్రూట్స్ తినటానికి ఇష్టపడతారు. పండ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు.
పండ్లలో ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు, మినరల్స్ పండ్లలో పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి. ప్రతీ పండులోనూ ఏవో కొన్ని ప్రత్యేక పోషక అంశాలు ఉంటాయి. ఫ్రూట్స్ తినడం వల్ల బరువును అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే జీవక్రియను కూడా పెంచుతుంది. ప్రతీరోజూ ఉదయం అల్పాహారంలో పండ్లు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే పండ్లు తినేటప్పుడు కొంతమంది తమకు తెలీకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు.
ఫ్రూట్స్ తినేటపుడు చేయకూడని పనులు
చాలామంది పండ్లను వివిధ పదార్ధాలతో అంటే ఉప్పు, కారం, పంచదార వంటి వాటిని కలుపుకుని తింటుంటారు. అయితే ఇలా తినడం వల్ల జీర్ణశక్తి క్షీణించే అవకాశం ఉంటుంది. వివిధ పదార్ధాలతో కలిపి పండ్లను తినడం ద్వారా శరీరానికి కావల్సిన పోషకాలు పూర్తిగా లభించవు. కాబట్టి పండ్లను ఎప్పుడూ ఇతర పదార్ధాలతో కలిపి తినకూడదు.
ఫ్రూట్స్ తినడానికి బెస్ట్ వేళలు
సాధారణంగా పండ్లు తినడానికి నిర్దేశిత సమయం అంటూ ఏమీలేదు. అయితే నిపుణుల సలహా ప్రకారం, బ్రేక్ ఫాస్ట్ తర్వాత లేదా స్నాక్స్ సమయంలో లేదా యోగా, వ్యాయామం చేసిన తర్వాత సాయంత్రం వేళ పండ్లు తినాలని చెబుతారు. ఈ సమయాల్లో తినడం వల్ల పోషకాలు పుష్కలంగా అందుతాయని అంటున్నారు. పండ్లను గబాగబా తినకుండా బాగా నమిలి తినడం ద్వారా జీర్ణవ్యవస్థ బలంగా మారుతుంది. పండ్లను కోసి ముక్కలుగా తినే బదులు.. మొత్తంగా తినాలి. అలా తినడం వల్ల శరీరానికి కావలసిన ఫైబర్స్ అందుతాయి. అది జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడం సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా, కడుపులోని ఇతర సమస్యలతో పాటు మలబద్దకాన్ని తగ్గించుకోవచ్చు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ