అబ్బాయి ఏ వయసులో తండ్రి అవగలడు? సైన్స్ ఏం చెబుతోంది?

At What Age Can a Boy Become a Father What Does Science Say,At What Age Can a Boy Become a Father,What Does Science Say,Boy Become a Father,Mango News,Mango News Telugu,A new challenge for science, Age of fatherhood,To become a father from the age of 11 to 14 years, Girls can become mothers from the age of 13,Can A Child Become A Father,The best age to become a father,Best age to have a baby,Male fertility,Best age to have a baby

పెళ్లయిన తర్వాత ఏ యువకునికి అయినా తండ్రి కావడం అనేది చాలా గొప్ప, కొత్త అనుభూతిని ఇస్తుంది. ఆ అనుభూతే బిడ్డ ఎదుగుతున్నకొద్దీ మరింత పెరిగి పెద్దదవుతుంది. చివరకు పిల్లలు ఎంత పెద్దయినా .. మొదటిసారి బిడ్డ (First time baby) కలిగినప్పుడు కలిగిన ఫీలింగ్‌ను మాత్రం జీవితాంతం మోస్తూనే ఉంటారు. అయితే చాలామందిలో అబ్బాయిలకు తండ్రి అయ్యే వయస్సు (Age of fatherhood) ఎప్పటి నుంచి వస్తుందనే అనుమానం ఉంటుంది. కొన్ని కొన్ని సందర్బాలలో జరిగిన సంఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటాయి.

తాజాగా బ్రిటన్‌కు (Britain) చెందిన షాన్ స్టీవర్ట్ (Shawn Stewart) అనే 11 ఏళ్ల అబ్బాయి ఇలాగే వార్తల్లో నిలిచాడు. ఆ వయసులోనే తండ్రి అవడం అటు శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేయగా.. విజ్ఞానశాస్త్రానికి కొత్త సవాల్‌ (A new challenge for science)ను ముందుంచింది. ఇప్పటికే అబ్బాయి ఏ వయసులో తండ్రి అవగలడు అన్న ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుండగా షాన్ స్టీవర్ట్ 11 సంవత్సరాలలో తండ్రి అయి మళ్లీ ఆ చర్చలను జోరందుకునేలా చేశాడు.

నిజానికి అబ్బాయి తండ్రయ్యే వయస్సు గురించి సైన్స్ చెబుతున్న వివరాల ప్రకారం.. మగ పిల్లాడు 11 ఏళ్ల నుంచి 14 ఏళ్ల మధ్య వయసు నుంచే తండ్రిగా (To become a father from the age) మారేందుకు అతను అర్హుడు అవుతాడు. అంటే ఆ వయసు నుంచే అబ్బాయిలలో స్పెర్మ్ ఉత్పత్తి కావడం ప్రారంభమవుతుందట. అప్పటి నుంచే ఆ అబ్బాయి ఓ అమ్మాయిని గర్భవతిని చేయగలుగుతాడు. అయితే అన్నిసార్లు ఇది సాధ్యమా అంటే.. సాధ్యం కాదని సైన్స్ చెబుతోంది. ఇది ఒక్క మగ పిల్లలతోనే సాధ్యం కాదు.. అవతలి అమ్మాయి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే యువతి బయోలాజికల్ క్లాక్‌పై డిపెండ్ అయి ఉంటుందట. ఎక్కువ సందర్భాలలో 14 ఏళ్ల తర్వాతే అబ్బాయి తండ్రి అయ్యే పూర్తి సామర్ధ్యాన్ని (Full capacity to be a father) పొందుతాడు. చాలా రేర్ సందర్భాలలో మాత్రమే 11 నుంచి 14 ఏళ్ల వయసులో షాన్ స్టీవర్ట్‌కు జరిగినట్లు జరుగుతుందని సైన్స్ చెబుతోంది.

అలాగే అమ్మాయిలు ఏ వయసు నుంచి తల్లి అయ్యే సామర్ధ్యాన్ని సంతరించుకుంటారోనని చాలామందికి అనుమానం ఉంటుంది. అమ్మాయిలు అయితే 13 ఏళ్ల వయసు నుంచి తల్లి అవగలరని (Girls can become mothers from the age of 13) సైన్స్ చెబుతోంది. చాలా రేర్ సందర్భాలలో 10 నుంచి 12 ఏళ్ల వయసులోనే తల్లిగా మారుతూ ఉంటారు. ఇది చాలా అంటే చాలా అరుదుగా ఇలా జరుగుతుంటాయని సైన్స్ చెబుతుంది. ఒక విధంగా చెప్పాలంటే అమ్మాయిలు 10 ఏళ్ల నుంచి 12 ఏళ్ల మధ్యలోనే తల్లి అయ్యే సామర్ధ్యాన్ని పొందుతారు. అయితే బిడ్డ ఆరోగ్యవంతంగా పుట్టడానికి కనీసం అమ్మాయికి 18 ఏళ్లు నిండాలని సైన్స్ చెబుతోంది. అందుకే చట్టప్రకారం కూడా అమ్మాయి వయసు 18 ఏళ్లు అని.. ఆ వయసు దాటితేనే తల్లి అయ్యేందకు తగిన వయసు వచ్చినట్లు అని గుర్తించారు. అయితే ఈ చట్టం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =