రాగి ఆభరణాలతో ఆరోగ్యం

Health With Copper Jewellery, Copper Jewellery, Copper Jewellery Advantages, Copper Jewellery Benifits, Health Benefits of Copper Rings, Copper Bracelets, Check With Copper For Many Diseases, Copper Ring, Copper Straps, Gold, Silver, Health Tips, Healthy Diet, Fitness, Mango News, Mango News Telugu

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే నానుడి ఎప్పటికీ ఎవ్వర్ గ్రీనే అంటే ఎవరూ కాదనలేరు. ఎందుకంటే..ఇప్పుడు నీటిని శుద్ధి చేయడానికి వాటర్ ఫిల్టర్లు, ఆర్వో ఫ్యూరిఫయర్లు వచ్చాయి. కానీ పూర్వం మన పెద్దలు రాగి పాత్రల్లో నీటిని నిల్వ ఉంచి తాగేవారు. రాగి పాత్రల్లో నీటిని వేస్తే.. సూక్ష్మ జీవులు నాశనమవుతాయని పరిశోధకులు ఆధారలతో సహా చెప్తున్నారు.

దీంతో ఆ పాత తరాన్నే ఫాలో అవుతూ ఇప్పుడు మంచి ఆరోగ్యం కోసం రాగి పాత్రలనే నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అయితే రాగి పాత్రలు వాడటమే కాదు.. కాపర్ ఆర్నమెంట్స్ కూడా హెల్త్ కు మంచిదే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాగి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అదే విధంగా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్న రాగితో చేసిన పట్టీలు, ఉంగరం పెట్టుకోవడం ఎన్నో ప్రయోజనాలున్నాయి.

రోగనిరోధక శక్తి పెంచడానికి..
రాగి ఉంగరం, పట్టీలు పెట్టుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రాగికి రక్తాన్ని శుభ్రపరిచే గుణం ఉంది.
గుండె ఆరోగ్యానికి..
కాపర్ ఆర్నమెంట్స్ పెట్టుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. గుండె సంబంధిత సమస్యలను దరిచేరకుండా ఇది చూసుకుంటుంది. ఎందుకంటే రాగి బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల గుండె ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.
గొంతు సంబంధిత సమస్యలు తగ్గించడంలో..
దగ్గు, గొంతు సంబంధిత సమస్యలు తగ్గించడానికి కూడా రాగి బాగా ఉపయోగపడుతుంది.
చర్మానికి, జుట్టుకి మంచిది..
రాగి ఉంగరం, పట్టీలు పెట్టుకోవడం వల్ల చర్మం ఎంతో బాగుంటుంది. అదే విధంగా జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
జీర్ణ సమస్యలను తొలగించడానికి..
జీర్ణ సంబంధిత సమస్యలు తొలగించడానికి కూడా రాగి బాగా ఉపయోగపడుతుంది. ఎసిడిటీ మొదలైన సమస్యలను రాగి దూరం చేస్తుంది.
పాదాల ఆరోగ్యానికి..
పాదానికి ఎప్పుడూ రాసుకుంటూ ఉండే కాపర్ పట్టీలు, మెట్టెల వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అందువల్ల పాదాల వాపు తగ్గుతుంది. ఎముకలు బలహీనంగా ఉన్న వారికి ఈ పాదాల నొప్పి పైవరకూ పాకుతుంది. రెగ్యులర్ గా రాగి పట్టీలు పెట్టుకోవడం వల్ల ఈ సమస్యని తగ్గించవచ్చు.