ఒకరోజు తిండి లేకపోయినా మనిషి నార్మల్‌గా ఉండగలడేమో కానీ.. ఒక్క రోజు నిద్ర లేకపోతే ప్రపంచమే కళ్ల ముందు గిర్రున తిరిగినట్లు ఉంటుంది. ఏ పని చేసినా అయోమయం వెంటాడుతూ.. పని మీద కాన్సన్‌ట్రేట్ చేయలేక సతమతమవుతూ ఉంటాడు. ఎందుకంటే..
మనిషికి తిండి, నీరు ఎలాగో నిద్ర కూడా అంతే. ఇంకాస్త చెప్పాలంటే నిద్ర ఇంకా ఎక్కువ . ఈ మూడు లేకుండా మనిషులు ఉండలేరు.అయితే మారిన కల్చర్, ఆహారపు అలవాట్లు, ఒత్తిళ్లు వల్ల నిద్ర లేమి సమస్య చాలామందిలో కనిపిస్తుంది.
మనిషి ప్రతిరోజు 6 లేదా 7 గంటలు కచ్చితంగా నిద్రపోవాలి. కానీ ఇప్పుడు చాలామంది 5 నుంచి ఆరు గంటల కంటే తక్కువగా నిద్రపోతున్నారు. కానీ ఇలా రోజూ 6 గంటల కంటే తక్కువగా నిద్రపోవడం వల్ల..భవిష్యత్తులో గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి వల్ల మనం చాలా ప్రమాదకరమైన గుండె జబ్బుల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తన్నారు.తమ అధ్యయనాల ప్రకారం రోజూ 6 గంటల కంటే తక్కువగా నిద్రపోయిన వారిలోనే గుండెపోటు, స్ట్రోక్, కరోనరీ ఆర్టరీ డిసీస్ వంటి సమస్యలతో బాధపడేవారిని గుర్తించినట్లు చెబుతున్నారు..
నిజానికి నిద్ర తక్కువ అయితే అది అధిక రక్తపోటు సమస్యకు దారి తీస్తుంది. హైబీపీ ఎప్పుడూ కూడా గుండె జబ్బులకు ప్రధాన కారణమన్న విషయం తెలిసిందే. ఈ అధిక రక్తపోటు వల్ల గుండెపై కలిగే ఎక్కువ ఒత్తిడి ధమనుల ఆరోగ్యానికి నష్టాన్ని కలిగ జేస్తుంది. అలాగే నిద్ర తక్కువ అయితే ధమనులు గట్టిపడతాయి. దీనివల్ల రక్తప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది. దీనివల్లే గుండెలో మంట వంటి సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. అలాగే గుండె కొట్టుకునే వేగంలోనూ మార్పులు రావడం వల్ల హార్ట్ అటాక్ బారిన పడుతున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్‌ల బారిన పడేవారు ఎక్కువ అవుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
అలాగే నిద్ర తక్కువ అయితే బరువు విపరీతంగా పెరిగి..మెల్లగా ఊబకాయానికి దారి తీస్తుంది. ఈ ఊబకాయానికి.. గుండె సమస్యలకు చాలా దగ్గర సంబంధం ఉంటుందన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అలాగే తక్కువగా నిద్రపోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. దీనివల్ల శరీరంలో చక్కర స్థాయిలు పెరిగి.. మధుమేహం బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. అలాగే నిద్రలేకపోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కూడా పెరుగుతాయి. దీర్ఘకాలిక ఒత్తిడి గుండె ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.ఇలా నిద్ర తక్కువ అవడానికి, గుండె ఆరోగ్యానికి సంబంధం ఉంది కాబట్టి.. గుండె సంబంధిత సమస్యలు రాకుండా అందరూ తగినంత నిద్రపోవాలని సూచిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE