వాయుకాలుష్యం పక్షవాతానికి కారణమవుతుందట

Researchers Have Found A Link Between Air Pollution And Paralysis,Researchers Have Found A Link,Link Between Air Pollution And Paralysis,Air Pollution And Paralysis,Mango News,Mango News Telugu,Researchers, Link Between Air Pollution And Paralysis, Pollution, Paralysis, Air Pollution,Air Pollution And Paralysis Latest News,Exposure To Air Pollution,Air Pollution Exposure,Air Pollution And Paralysis Latest News,Air Pollution And Paralysis Latest Updates,Air Pollution And Paralysis Live News

తాజాగా వాయుకాలుష్యం,పక్షవాతం మధ్య గల సంబంధాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. కొంతకాలం పాటు వాయు కాలుష్యానికి గురి అయినా కూడా దాని వల్ల పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని ఒక అధ్యయనంతో తేలింది. న్యూరాలజీ జర్నల్‌లో ఈ పరిశోధన వివరాలను ప్రచురించారు. ఈ అధ్యయనం ప్రకారం కొంతకాలం పాటు వాయుకాలుష్యానికి గురైన ఐదు రోజులలోనే వారికి పక్షవాతం వచ్చే అవకాశం ఉన్నట్లు తేల్చింది.

నిజానికి పక్షవాతం వస్తే..దాని వల్ల మెదడు దెబ్బతినడంతో పాటు దీర్ఘకాలిక వైకల్యంతో పాటు ఒక్కోసారి మరణం కూడా సంభవిస్తుంది. అలాగే చాలా కేసుల్లో పక్షవాతం వల్ల శరీరంలో ఒక వైపు భాగాలు మొత్తంగా పని చేయకుండా అయిపోతాయి. అంతకుముందు కూడా దీర్ఘకాలిక వాయు కాలుష్యం వల్ల పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని తేలినట్లు అమ్మాన్ లోని జోర్డాన్ యూనివర్సిటీ తెలిపింది. అయితే ఇప్పుడు స్వల్పకాలికంగా ఉన్న ఎయిర్ పొల్యూషన్ ఎలాంటి వ్రభావం చూపిస్తుందో అని పరిశోధించినట్లు చెప్పింది. అయితే దీనిలో ఎన్నో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పిన అధ్యయన కర్తలు.. స్వల్పకాలిక వాయుకాలుష్యం కూడా కేవలం 5 రోజుల్లోపక్షవాతానికి కారణమవుతుందని తేలిందని అన్నారు.

110 అధ్యయనాల్లో 18 మిలియన్లకు పైగా పక్షవాతం కేసుల్ని అధ్యయనకర్తలు పరిశీలించారు. ఈ పరిశోధనలో నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయు కాలుష్యాల ప్రభావాన్ని కూడా విశ్లేషించారు. 1 మైక్రాన్, PM2.5, PM10, PM1 వంటి పరిమాణాలు ఉన్న ఎయిర్ పొల్యూషన్ రేణువుల్ని కూడా జాగ్రత్తగా పరిశీలించారు. PM2.5 కాలుష్య రేణువులయితే వెహికల్స్, పవర్ ప్లాంట్లు, ఇతర ఇంధనాలు కాల్చడం వల్ల వెలువడుతుందని గుర్తించారు. ఇలా అధిక సాంద్రత కలిగిన కాలుష్యం వల్ల పక్షవాతం ప్రమాదాన్ని పెంచుతున్నట్లు చెప్పారు.

నైట్రోజన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉంటే పక్షవాతం వచ్చే ప్రమాదం 28 పర్సంట్, ఓజోన్ స్థాయిల వల్ల 5 శాతం పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. కార్బన్ మోనాక్సైడ్ 26 పర్సంట్, సల్ఫర్ డయాక్సైడ్ 15 పర్సంట్ పక్షవాతం ప్రమాదాన్ని పెంచుతున్నాయని తెలిపారు. PM1 అధిక సాంద్రత వల్ల 9 పర్సంట్, PM2.5 కాలుష్యం వల్ల 15 పర్సంట్, PM10 వల్ల 14 పర్సంట్ పక్షవాతం వచ్చే ప్రమాదం ఉన్నట్లు తేలింది. అయితే 60 పర్సంట్ నైట్రోజన్ డయాక్సడ్ సాంద్రత ఉంటే.. 33 పర్సంట్ పక్షవాతం మరణాలకు దారి తీస్తుందని, సల్ఫర్ డయాక్సైడ్ వల్ల 60 పర్సంట్, పీఎ 2.5 వల్ల 9 పర్సంట్, పీఎం 10 వల్ల 2 పర్సంట్ వల్ల పక్షవాతం ఏర్పడి మరణాలు కూడా సంభవించే అవకాశం ఉందని పరిశోధకులు తేల్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 1 =