చెన్నై నగరానికి చెందిన తల్లి, కుమార్తెలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది వరల్డ్ అయ్యారు. ఇప్పటి వరకూ కనీవినీ ఓ రికార్డును తమ క్రెడిట్లో వేసుకుని అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. మిస్ వరల్డ్, మిసెస్ వరల్డ్‌గా ఎన్నికైన వీరిద్దరూ దేశస్థాయిలోనూ సరికొత్త రికార్డు సృష్టించారు.
అమెరికాలోని లాస్ ఏంజల్స్ సిటీలో రాయల్ క్రూస్ నౌకలో ఈ మధ్య 9 రోజుల పాటు జరిగిన మిస్ వరల్డ్, మిసెస్ వరల్డ్ పోటీలు గ్రాండ్ గా జరిగాయి. ఈ పోటీలలో 70కుపైగా దేశాల నుంచి పోటీదారులు పార్టిసిపేట్ చేశారు. వారిలో చెన్నైకు చెందిన తల్లీ కుమార్తెలు పాల్గొని అందరి దృష్టిని ఆకట్టుకోవడమే కాదు..ఏకంగా టైటిల్స్ సాధించారు.
డాక్టర్ ఫ్లారెన్స్ హెలన్ నళిని ‘మిస్ స్పిరిట్ ఆఫ్ వరల్డ్ యూనివర్స్ అండ్ మిసెస్ ఇంటర్నేషనల్ వరల్డ్ పీపుల్’ టైటిల్‌ను అందుకుంటే, ఆమె కుమార్తె సరిహా చౌదరి ‘మిస్ వరల్డ్ యూనివర్సల్ 2024′ టైటిల్‌ను అందుకున్నారు. తాజాగా చైన్నైకి తిరిగి వచ్చిన వీరిద్దరూ.. తమ అనుభూతిని అక్కడి మీడియాతో పంచుకున్నారు. తొలి ప్రయత్నంలోనే టైటిల్ ను అందుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు.
తన తల్లి డాక్టర్ ఫ్లారెన్స్ హెలన్ మిసెస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడం చూసాక.. తాను కూడా మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనాలనే భావన తనకు కలిగిందని సరిహా అన్నారు. అయితే ఫ్లారెన్స్ హెలన్‌కు మోడలింగ్‌లో ఎలాంటి అనుభవం లేదు. ఆమె మానసిక వైద్యనిపుణురాలు, పారిశ్రామికవేత్త, రచయిత ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె అందాల పోటీలలో కూడా వరుసగా క్రౌన్ గెలుచుకోవడం చూసి కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
2021లో డాక్టర్ ఫ్లారెన్స్ హెలన్ ..మిసెస్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాసిక్‌ను, అనుబంధ విభాగంలోగ్లామరస్ ఎచీవర్’ టైటిల్‌ను పొందారు. 2022లో మిస్ ఇంటర్నేషనల్ వరల్డ్ పీపుల్స్ ఛాయిస్ విన్నర్ 2022′ టైటిల్‌ను కూడా ఈమె దక్కించుకున్నారు.