ఇంజక్షన్‌తోనే ఇన్సులిన్ అనే మాటకు చెల్లు..

insulin,injection, needle pains, diabetes sufferers, diabetes, insulin injection
insulin,injection, needle pains, diabetes sufferers, diabetes, insulin injection

డయాబెటిస్ బాధితులు వ్యాధి ప్రారంభంలో ఉన్నప్పుడు టాబ్లెట్ల ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకుంటారు. అయితే మధుమేహం ఎక్కువ శాతంలో వ్యాపిస్తే మాత్రం వాళ్లకు ఇన్స్ లిన్ ద్వారా కంట్రోల్ చేసుకోవడం ఒకటే మార్గం అన్న విషయం అందరికీ తెలిసిందే. డయాబెటిస్ రోగులు ఈ ఇన్సులిన్ తీసుకోవాలంటే మాత్రం సూది గుచ్చుకోక తప్పదు. కానీ ఇకపై ఈ బాధ తీరిపోయే సమయం ఎంతో దూరంలో లేదన్న వార్త వినిపిస్తోంది

హైదరాబాద్‌కు చెందిన నీడిల్ ఫ్రీ టెక్నాలజీస్ డయాబెటిస్ రోగులకు.. ఇంజక్షన్ అవసరం లేకుండా కేవలం నోటి ద్వారా తీసుకునే ఇన్సులిన్ స్ప్రే ‘ఓజులిన్ ‘ను’ అభివృద్ధి చేసింది. దీంతో  మధుమేహ చికిత్సలో నొప్పిలేకుండా  ఒక ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చినట్లు అయింది. ఇప్పటికే నలభైకి పైగా దేశాల్లో ఓజులిన్ కు ఇంటర్నేషనల్ పేటెంట్ హక్కులను సంపాదించినట్లు నీడిల్ ఫ్రీ టెక్నాలజీస్ చెబుతోంది. ఇపుడు ఓజులిన్ పై భద్రతా పరీక్షలను నిర్వహించడానికి సీడీఎస్‌సీఓ అంటే..  సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్  కంట్రోల్ ఆర్గనైజేషన్ కు తాము దరఖాస్తు చేసినట్లు తెలిపింది. సాధారణ్గా మనుషులపై క్లినికల్  పరీక్షలను నిర్వహించే ముందు  ఈ భద్రతా పరీక్షలు తప్పనిసరిగా చేస్తారు. నీడిల్ ‌ఫ్రీ పేరెంట్ కంపెనీనే ..  ఈ ట్రాన్స్ జీన్ బయోటెక్ కంపెనీ.

అంతేకాదు రాబోయే రోజుల్లో క్యాన్సర్, ఆస్టియోపొరాసిస్ , అల్జీమర్స్  వంటి వ్యాధులకు చేసే చికిత్సకోసం కూడా  నోటి ద్వారా, ముక్కు ద్వారా వేసుకునే ఓరల్ స్ప్రేలను తీసుకురావడానికీ నీడిల్ ఫ్రీ టెక్నాలజీస్ ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం  దాదాపు రూ.1845-2050 కోట్లు పెట్టుబడులు సమీకరించడానికి సంస్థ ప్రయత్నిస్తోంది. నీడిల్ ఫ్రీ టెక్నాలజీస్ ప్రస్తుతం అభివృద్ధి చేసిన నీడిల్ ఫ్రీ, ఓరల్  ఇన్సులిన్ ‌ స్ప్రేను మనుషులతో పాటు జంతువులకూ ఉపయోగించొచ్చని కంపెనీ చెబుతోంది .

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో బయోఫార్మా కంపెనీలు ఓరల్‌గా తీసుకునే ఇన్సులిన్ ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాయి. అయితే సరిపడా ఇన్సులిన్‌ను బ్లడ్‌లోకి పంపడంలో కొద్ది శాతంగానే సక్సెస్ కాగా.. ఈ విషయంలో నీడిల్‌ఫ్రీ దాదాపు పూర్తిగా విజయవంతమైంది ఇటీవల కుక్కలపై నిర్వహించిన పరీక్షల్లో 91 %  పైగా బయో అవైలబులిటీని ఓజులిన్‌ స్ప్రే ప్రదర్శించినట్లు గుర్తించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE