‘ఇండియా’లో ఏం జరుగుతోంది..

what happend in india alliance,what happend in India,India Alliance, India, CM nitish kumar, congress,Mango News,Mango News Telugu,Congress waiting game over,INDIA alliance shifts into election mode,State elections threatens INDIA,India Alliance Latest News,India Alliance Latest Updates,India Alliance Live News,CM nitish kumar Latest News,Congress Live Updates,Congress Latest News
india alliance, india, cm nitish kumar, congress,

‘అయిదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపైనే కాంగ్రెస్‌ పార్టీ తన దృష్టిని కేంద్రీకరించింది. ఇండియా కూటమిని అసలు పట్టించుకోవడం లేదు.’ అంటూ బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీని ఎదుర్కొనేందుకు కూటమిని ఏర్పాటు చేసింది నిజమే కానీ.. ఆ దిశగా మాత్రం కాంగ్రెస్‌ పనిచేయడం లేదన్నారు. ఉమ్మడి పోరాటం చేయాలని, కేంద్రంలోని బీజేపీ సర్కారును గద్దె దింపాలని సంకల్పం చెప్పుకొన్న ‘ఇండియా’ కూటమి పార్టీల మధ్య తాజాగా సఖ్యత కనిపించడం లేదు.

అలాగే.. ఎన్నికల సమయంలో సహకరించుకోవాల్సింది పోయి.. విమర్శలు చేసుకుంటున్నారు. ఇండియా కూటమిలో కాంగ్రెస్‌తో పాటు సమాజ్‌వాదీ(ఎస్పీ), ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌)లు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో ఈ పార్టీలు కలిసి పోటీచేస్తాయని అందరూ భావించినా.. చివరకు కాంగ్రెస్‌పైనే ఎస్పీ, ఆప్‌లు పోటీకి సిద్ధమయ్యాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలున్న స్థానాల్లో ఎస్పీ, ఆప్‌లు తమ పార్టీల అభ్యర్థులను నిలబెట్టాయి. ఫలితంగా రాష్ట్రంలో బీజేపీ పాలనపై ఆగ్రహంతో ఉన్న కొన్ని వర్గాల ప్రజల ఓట్లను ఈ రెండు పార్టీలు చీల్చే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడిగా బరిలోకి దిగినట్టయితే ఓట్లు చీలకపోవచ్చని, తద్వారా కాంగ్రెస్‌కు మేలు జరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే, ఓట్ల చీలిక వాదనను కాంగ్రెస్‌ సహా ఎస్పీ, ఆప్‌ నేతలు కొట్టిపారేస్తున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ రెండు పార్టీల మద్దతుదారుల నుంచి తమకు ఓట్లు పడతాయని ఎస్పీ, ఆప్‌ నేతలు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్‌లోనూ బలంగా ఉన్నామని చెబుతున్న సమాజ్‌వాదీపార్టీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 52 స్థానాల్లోనే తమ అభ్యర్థులను నిలబెట్టింది. వీటిలో ఒకే ఒక్క స్థానంలో విజయం దక్కించుకోగా ఆరు స్థానాల్లో రెండోస్థానానికి పరిమితమైంది. ఇక, 45 మంది ఎస్పీ అభ్యర్థులు తమ డిపాజిట్లను సైతం కోల్పోయారు. ఇక, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో చంబల్‌ సహ విధ్య ప్రాంత్లో ఎస్పీ 33 స్థానాల్లో తన అభ్యర్థులను బరిలో నిలిపింది. అయితే, వీటిలో శబల్‌గఢ్‌, జౌరా, సుమవాలీ, దిమ్ని వంటివి కాంగ్రెస్‌కు సిట్టింగ్‌ స్థానాలు కావడం గమనార్హం. 2018లో ఆయా స్థానాలను కాంగ్రెస్‌ దక్కించుకోవడమే కాదు.. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఈ స్థానాలు తమకే దక్కుతాయని నమ్మకంతో ఉన్నారు. అయితే.. ఎస్పీ రంగంలోకి దిగడంతో ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థుల పరిస్థితి ఇబ్బందిగా మారింది.

అలాగే ఆమ్‌ఆద్మీపార్టీ గత ఎన్నికల్లో 208 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. అయితే, ఈ దఫా కేవలం 69 స్థానాలకే పరిమితమైంది. గత ఎన్నికల్లో కొన్ని స్థానాలను మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్లా ఆప్‌ అభ్యర్థులు డిపాజిట్లు పోయారు. అయితే, ఇప్పుడు పరిస్థితి మెరుగుపడిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పుంజుకున్నామని ఆప్‌ నేతలు చెబుతున్నారు. అయితే..  కూటమి కట్టుబాట్లు.. సర్దుబాట్లు ప్రకారం పోటీలో ఉన్నట్లు కనిపించడం లేదు. ఎస్పీ, ఆప్‌ నేతలు తీసుకుంటున్న నిర్ణయాలతో కొన్నిచోట్ల కేవలం బీజేపీపైనే ప్రభావం కాకుండా, కాంగ్రెస్‌ కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఇండియా కూటమిలో లక్ష్యానికి విరుద్ధంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నట్లుగా కనిపిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 3 =