యాగం.. రాజకీయం..!

kcr rajashyamala yagam,rajashyamala yagam,cm kcr, brs, telangana politics, yagam, assembly elections,Telangana Chief Minister Kcr,kcr yagam,Mango News,Mango News Telugu, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News,rajashyamala yagam Latest News,rajashyamala yagam Latest Updates,rajashyamala yagam Live News,kcr Latest News and Updates
cm kcr, brs, telangana politics, yagam, assembly elections

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు యాగాలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో కూడా పలుమార్లు భారీ స్థాయిలో యాగాలు చేశారు. అయితే.. ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రారంభించిన రాజశ్యామల, శతచండీ యాగాలు రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలని కేసీఆర్‌ యాగం చేస్తున్నారని ప్రభుత్వ పెద్దలు చెబుతుంటే.. అధికారం సిద్ధించటానికి, శత్రువుల బలం తగ్గడానికి, జన వశీకరణ కోసం కూడా ఇలాంటి యాగం చేస్తారని పలువురు పండితులు, విపక్ష నేతలు చెబుతున్నారు.

రాజశ్యామల, శతచండీ పేరుతో ముఖ్యమంత్రి రెండు రోజులుగా యాగాలు చేస్తున్నారు. బుధవారం ఉదయం విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని సీఎం వ్యవసాయ క్షేత్రంలో ఈ యాగం చేస్తున్నారు. రాజశ్యామల, శతచండీ మాత, మరో రెండు మంటపాల వద్ద పూజలు చేశారు. గురు దేవతా ప్రార్థన, మహా సంకల్పం, గణపతి పూజ, స్వస్థి పుణ్యహవచనము, ఆచార్య అఽథి, రుతిగ్వ, రణం, యాగశాల సంస్కారం, గోపూజ, సహస్ర మోదక, గణపతి హోమం, అదిత్య అథి నవగ్రహ హోమం, నవాక్షర మూలమంత్ర జప అనుష్టానం, రాహుగృహస్థపతి, నందిశాంతి, రైలోక్య, మోహన గౌరీ హోమం, అఘోరహస్య, హోమకార్యం, చండీసప్త పారాయణాలు, చతుర్వేద పారాయణాలు, మహా మంగళహారతి, మంత్రపుష్పం, అష్టావధాన తదితర కార్యక్రమాలను కేసీఆర్‌ దంపతులతో వేదపండితులు నిర్వహించారు.

స్వరూపానందేంద్ర పర్యవేక్షణలో రాజశ్యామల యాగం కొనసాగుతోంది. శృంగేరీ పండితులు గోపీకృష్ణ శర్మ, శశాంక్‌ శర్మల పర్యవేక్షణలో శతచండీ యాగం నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా.. ఈ యాగానికి ఎంపీలు నామ నాగేశ్వర్‌రావు, వేణుగోపాలాచారి, మధుసూదనాచారి పర్యవేక్షిస్తున్నారు. కాగా.. తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలనే కేసీఆర్‌ రాజశ్యామల యాగం చేయిస్తున్నారని స్వరూపానందేంద్ర తెలిపారు.

గతంలో కూడా కేసీఆర్‌ ఎర్రవల్లిలో ఉన్న ఫాంహౌజ్‌ లో మహారుద్ర సహిత సహస్ర చండీ మహాయాగం చేశారు. అలాగే.. యజ్ఞయాగాదులు చేసే అలవాటున్న తెలంగాణ కేసీఆర్‌ రాష్ట్రంలోనే కాకుండా.. ఏపీలో కూడా ఒక కీలక యాగంలో పాల్గొన్నారు. అనంతరం జాతీయ స్థాయి లక్ష్యాలతో రాజకీయంగా ముందుకు కదులుతూ రాష్ట్రాల పర్యటన మొదలుపెట్టారు. ఏపీలోని విశాఖపట్టణంలో శారదపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజశ్యామల యాగంలో పాల్గొని.. అక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకున్నాక  బయలుదేరడం కూడా అప్పట్లో రాజకీయంగా చర్చ జరిగింది. ఇప్పుడు రాజశ్యామల యాగం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =