గుండెను పదిలంగా ఉంచుకోవడానికి గుమ్మడి గింజలు చాలట..

గుమ్మడి గింజలు అంటే చాలామంది ఇష్టపడరు .ఇప్పుడు వలిచిపెట్టిన గింజలు మార్కెట్లో అమ్మకానికి రెడీగా ఉంటున్నాయి. ఈ గుమ్మడి గింజలు తినటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గుండెజబ్బులకు దూరంగా ఉండొచ్చని అంటున్నారు.గుమ్మడి గింజల్లో యాంటీ స్ట్రెస్ న్యూరో కీమా లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఒత్తిడి తగ్గించి ఉపశమనం కలిగించటంలో బాగా పనిచేస్తాయి. ఈ విత్తనాలను తరుచూ పురుషులు తీసుకోవటం వల్ల వీర్యం బాగా ఉత్పత్తి అవుతుంది. టెస్టోస్టిరాన్ స్ధాయిలను పెంచటంతో పాటు శృంగార సామర్ధ్యం పెంపొందుతుందని ఆరోగ్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఈ గుమ్మడి గింజలను వలుచుకుని లోపల ఉన్న పప్పును తినవచ్చు. అలా కాకుంటే పప్పును బాగా దంచి పొడిలా చేసుకుని పాలల్లో కలుపుకుని తాగవచ్చు. అయితే గుమ్మడి గింజలను అధికంగా తీసుకోవటం వల్ల మలబద్ధక సమస్య ఉత్పన్నమౌతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుమ్మడి గింజలను ప్రతిరోజు తీసుకునేవారు నీరు ఎక్కవగా తాగటం మంచిదని సలహా ఇస్తున్నారు.

గుమ్మడి గింజలలో కొవ్వు అమ్లాలతోపాటు, పొటాషియం, అమైనో అమ్లాలు, ఫినోలిక్ సమ్మేళనాలు వంటి పోషకాలు లభిస్తాయి. వీటితోపాటు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్ లక్షణాలు కలిగి ఉన్నాయి. గుమ్మడి గింజలను తరుచూ తినటం వల్ల రక్తనాళాలు గట్టిపడకుండా నిరోధించవచ్చు. కొరోనరీ ఆర్టరీ వ్యాధి, గుండె పోటు వంటి వివిధ రకాల గుండె జబ్బుల సమస్యలను నివారించటానికి ఉపయోగపడతాయి.

గుమ్మడికాయ గుజ్జు, విత్తనాలను తినటం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచువచ్చు. జట్టుతోపాటు, చర్మ ఆరోగ్యానికి గింజలు చక్కగా ఉపయోగపడతాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గించే గుణం వీటిలో ఉంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే విటమిన్ ఏ, సీ గుమ్మడి గింజల్లో పుష్కలంగా లభిస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యాలైన ఆర్ధరైటీస్ , క్యాన్సర్ , గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి గుమ్మడి గింజలు మంచి మేలు చేస్తాయి. నిజానికి గుండె జబ్బులతో బాధపడేవారికి గుమ్మడి గింజలు ఓ వరమనే చెప్పొచ్చు.