కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొన్నప్పుడు దాన్ని పూర్తిగా ఛార్జ్ చేసి వాడాలంటారు? ఎందుకో తెలుసా..?

Do You Know Why Do Newly Bought Cell Phones Have to be Fully Charged,Newly Bought Cell Phones,Do You Know Why to be Fully Charged,Newly Bought Cell Phones Have to be Fully Charged, Mobile Full Charging, Mobiles, Smart Phones, 100% Charging, Li-ion Battery,Mango News,Mango News Telugu, buy a new smartphone you have to fully charge,Newly Bought Cell Phones Charge,Newly Bought Cell Phones Latest News,Newly Bought Cell Phones Live Updates

జనరల్‌గా ఎవరైనా స్మార్ట్ ఫోన్ కొన్నప్పుడు ఓపెన్ చేశాక వెంటనే వాడొద్దు.. దాన్ని ఫుల్ ఛార్జింగ్ పెట్టి మాత్రమే వాడాలని షాపు వాళ్లు చెబుతారు. ఒకవేళ ఆన్ లైన్‌లో కొంటే ఇంట్లో వాళ్లు కానీ, ఫ్రెండ్స్ కానీ అదే చెబుతూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫుల్ ఛార్జింగ్ పెట్టకుండా వాడొద్దని వార్నింగ్ ఇస్తారు.

అయితే దీనికి ఎందుకలా అని ప్రశ్నిస్తే మాత్రం.. కొంతమంది చెబుతారు మరికొంతమందికి దానిపై అవగాహన ఉండదు. వాడొద్దంటారు కానీ కరెక్ట్ రీజన్ ఏంటో తెలియదని అని చెప్పేస్తారు. అసలు కొత్త మొబైల్‌ని కొన్న తర్వాత మొబైల్‌ను పూర్తిగా ఛార్జ్ ఎందుకు చేయాలి? ఛార్జింగ్ లేకుండా దానిని ఎందుకు ఉపయోగించకూడదు.. అలాగే వా డితే ఏమవుతుంది? దీని వెనుక ఉన్న కారణాలు తెలుసుకోండి.

కొత్త మొబైల్ ఫోన్‌ను కొన్న తర్వాత దానిని పూర్తిగా ఛార్జ్ చేయడానికి.. చాలా మొబైల్ ఫోన్‌లలో ఉపయోగించే లి-అయాన్ బ్యాటరీ మెయిన్ రీజన్‌గా చెబుతారు.లి-అయాన్ బ్యాటరీలోని ప్రతి సెల్ కూడా.. డెప్త్ ఆఫ్ డిస్టార్షన్‌ని తగ్గించాలని మొబైల్ కంపెనీలు సిఫార్సు చేస్తుంటాయి. కొత్త ఫోన్‌ను 100% అంటే పూర్తి ఛార్జ్ చేస్తే అప్పుడు బ్యాటరీ డెప్త్ ఆఫ్ డిస్టార్షన్‌ జీరో శాతంగా అవుతుంది. అప్పుడు కొత్త స్మార్ట్ ఫోన్‌కు ఎలాంటి సమస్య ఉండదు.

ఆ తర్వాత నుంచి ఇప్పుడు చెప్పుకున్నట్లుగా..లి-అయాన్ బ్యాటరీ DOD అంటే డెప్త్ ఆఫ్ డిస్టార్షన్ మొత్తం 20 శాతం కంటే తక్కువగా ఉండాలి. అంటే కొత్తన ఫోన్‌ను స్టార్ట్ చేయడానికి.. పూర్తిగా ఛార్జ్ చేయబడిన బ్యాటరీ అవసరం అవుతుంది. అందుకే బ్యాటరీ కనీసం 20% కంటే తక్కువ డీఓడీని కలిగి ఉండాలి. అంటే 80% ఎక్కువగా బ్యాటరీ పవర్‌ని ఛార్జ్ చేయాలన్నమాట.

అలాగే హార్డ్‌వేర్ రక్షణ కోసం కూడా కొత్త ఫోన్ చార్జింగ్ పెట్టాలి. ఎందుకంటే కంపెనీలో ఫోన్ తయారీ చేశాక అది మొబైల్ షాప్స్‌కు వెళుతుంది. అక్కడ కూడా వెంటనే ఎవరూ కొంటారన్న గ్యారంటీ లేదు. అందుకే ఫోన్ కొన్నాక.. చాలా కాలంగా ఉపయోగంలో లేని మొబైల్ బ్యాటరీ, మొబైల్‌లోని అన్ని భాగాలకు ఒకేసారి ఛార్జింగ్ పెట్టాలి. అలాంటి సమయంలో మొబైల్‌లోని హార్డ్‌వేర్ కాంపోనెంట్స్‌కు చాలా ఎక్కువ ఎలక్ట్రికల్ పవర్ అవసరం అవుతుంది. కాబట్టి మొబైల్ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయాల్సి ఉంటుంది.

అయితే చాలామందికి అసలు కొత్త స్మార్ట్ ఫోన్ ఛార్జ్ చేయకపోతే ఏమవుతుందన్న అనుమానాలు చాలా మందికి ఉంటుంది. స్మార్ట్ ఫోన్‌ల కంపెనీలో.. అవి తయారై కస్టమర్‌కు చేరుకోవడానికి కనీసం 3 నుంచి 6 నెలల టైమ్ పడుతుంది. దీంతో బ్యాటరీ సెల్స్ షార్ట్ అవుతాయి. అందుకే కొన్న తర్వాత ఫుల్ చార్జింగ్ పెట్టాలి.

అంతేకాదు.. కొత్త మొబైల్ కొన్న తర్వాత మొబైల్ చార్జింగ్ పెట్టడానికి మరో రీజన్ కూడా ఉందని మొబైల్ కంపెనీలు చెబుతాయి. ఎందుకంటే కొత్త మొబైల్ కొన్నాక యాప్స్ ఇన్‌స్టాల్ చేయడం, ఫీచర్లు గమనించడం, గ్యాలరీ నుంచి కాంటాక్ట్స్ వరకూ అన్ని అప్ డేట్ చేయడంతో బ్యాటరీ త్వరగా అయిపోతుంది. అందుకే మధ్యలో చార్జింగ్ అయిపోవడం వంటి సమస్యలకు రాకుండా కూడా ఫుల్ ఛార్జింగ్ పెట్టాలని అంటున్నాయి కంపెనీలు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − three =