ప్రెగ్నెన్సీ సమయంలోనే కాదు ఒబెసిటీ వల్ల కూడా సాధారణంగానే స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. అయితే కొంతమందిలో ఇవి పోయినా మరికొంతమంది మాత్రం స్ట్రెచ్ మార్క్స్‌తో చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. ముఖ్యంగా చీరలు కట్టే మహిళలు మరింత ఇబ్బంది పడుతుంటారు. దీంతో ఈ స్ట్రెచ్ మార్క్స్‌ని పోగొట్టడానికి చాలా కష్ట పడుతూ ఉంటారు. అయితే కొన్ని చిట్కాలతో ఈజీగా ఈ చారలను పోగొట్టవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఎదుర్కొనే అనేక సవాళ్లలో స్ట్రెచ్ మార్స్క్ ఒకటి. చాలా మంది మహిళలకు పొట్టపై, తొడలపై చారలు అనేవి వస్తూ ఉంటాయి. డెలివరీ తర్వాత ఈ గీతలు మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ స్ట్రెచ్ మార్క్స్ వల్ల మహిళలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.
ఈ స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టుకోవడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు, తెలిసినవాళ్లు చెప్పే చిన్న చిన్న చిట్కాలు చాలానే ఉపయోగిస్తూ ఉంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో లేడీస్ పొట్ట సాగడం వల్ల ఏర్పడే గీతలు అంత కొందరిలో అంత ఈజీగా పోవు.
పొట్ట భాగంలో స్కిన్ వెనుక ఉండే ఫైబర్ కాస్త విరిగి పోవడం వల్ల కూడా ఇలాంటి గీతలు అనేవి కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొంతమందిలో ఈ గీతలు డెలివరీ అయిన కొన్ని రోజులకు మాయం అవుతాయి. కానీ కొంత మందికి మాత్రం అలానే ఉండిపోయి చిరాకు పెడతాయి.
అయితే ముందు నుంచీ కాస్త కేర్ తీసుకుంటే మచ్చలు ఉండవని నిపుణులుచెబుతున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మంది ఎక్కువగా జంక్ ఫుడ్ తిని బాగా లావతారు అవుతారు. వీరు ముందు నుంచీ కూడా వీటిని తగ్గించి.. నిమ్మరసం తాగుతూ ఉండాలి. దీని వల్ల వికారం తగ్గడంతో పాటు బరువు కూడా తగ్గుతారు. మచ్చలు రాకుండా కూడా ఉంటాయి.
అలాగే జోజో ఆయిల్‌ని పొట్టపై ఉన్న మచ్చలకు ప్రతి రోజూ రాస్తే ఈ గీతలు సులువుగా పోతాయి. కలబంద రసంలో ఆలివ్ ఆయిల్, కోకో బటర్ కూడా కలిపి స్ట్రెచ్ మార్క్స్‌పై అప్లై చేస్తే కూడా ఈ గీతలు కంట్రోల్ అవుతాయి. అంతేకాకుండా బాదం ఆయిల్, విటమిన్ ఈ ఉండే క్రీమ్స్ రాసినా స్ట్రెచ్ మార్క్స్ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ తేనె రాసినా కూడా స్ట్రెచ్ మార్క్స్ ను తగ్గించుకోవచ్చని అంటున్నారు.