గౌతమ్ గంభీర్ స్థానంలో నేషనల్ క్రికెట్ అకాడమీలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న (NCA) లక్ష్మణ్ ఇప్పుడు దక్షిణాఫ్రికాలో టీ20 సిరీస్ ఆడనున్న టీమ్ ఇండియాతో పాటు వెళ్లబోతున్నాడు. త్వరలో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి గౌతమ్ గంభీర్ సన్నద్ధం కావాల్సి ఉన్నందున బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికాలో నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. నవంబర్ 8న డర్బన్, 10న క్యూబెరా, 13న సెంచూరియన్, 15న జోహన్నెస్‌బర్గ్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక ఆస్ట్రేలియాలో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా నవంబర్ 10న భారత్ నుంచి బయలుదేరుతుంది. దీంతో గంభీర్ దక్షిణాఫ్రికాకి వెళ్లడం సాధ్యం అయ్యే పని కాదు . దీంతో సఫారీ టూర్ కు తత్కాలిక కోచ్ గా బీసీసీఐ లక్ష్మణ్ ను నియమించింది.
లక్ష్మణ్‌తో ఎవరు వెళ్తారు?
ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో లక్ష్మణ్‌తో కలిసి పనిచేస్తున్న సాయిరాజ్ బహుతులే, హృషికేష్ కనిట్కర్ మరియు శుభదీప్ ఘోష్ కూడా సహాయకులుగా వెళ్లనున్నారు. దక్షిణాఫ్రికాకు వెళ్లే సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఇప్పటికే ఎంపిక చేయగా, ఇద్దరు వికెట్ కీపర్లు జట్టులో ఉన్నారు. బంగ్లాదేశ్ జట్టుపై ఆడిన సంజూ శాంసన్, జితేష్ శర్మ 15 మందితో కూడిన జట్టులో ఉన్నారు.
బీసీసీఐపై విమర్శలు
ఇలా వెంటవెంటనే టూర్ షెడ్యూల్ చేయడంపై బీసీసీఐపై విమర్శలు వస్తున్నాయి. ఇక వచ్చే నెలలో భారత్ ఎ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. దాదాపు చాలా మంది క్రికెటర్లు ఈ పర్యటనలో ఉన్నారు. ఇన్ని పరిణామాల మధ్య రంజీ టోర్నీ కూడా జరుగుతుండటంతో ప్రాంతీయ జట్లకు కీలక ఆటగాళ్లు దొరకడం లేదు. అందువల్ల, ఈ సందర్భంలో ఈ పర్యటన అవసరమా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ మేరకు స్పోర్ట్స్ స్టార్ కాలమ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ రాసుకొచ్చారు.
ఇకపోతే దక్షిణాఫ్రికా సిరీస్ జరుగుతుండగానే ఐపీఎల్ వేలం ప్రక్రియ కూడా జరిగే అవకాశం ఉంది. అందువల్ల అక్కడ ఆడే మంచి ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.
సఫారీ టూర్ కు భారత టీ20 జట్టు
సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్) అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రామ్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, విజయకుమార్ వైశాఖ్, అవేష్ ఖాన్, యశ్ దయాల్.