బంగ్లాతో టెస్టు సిరీస్ ఆ బౌలర్ తో జాగ్రత్త..

Challenge For Team India In Test Series With Bangladesh, Challenge For Team India, Test Series With Bangladesh, Team India In Test Series, Ashes Test Series, Bangladesh Fast Bowler Nahid Rana, Mehdi Hassan, IND Vs Bangladesh, Kohli, Rohit, Team India, Test Series, WTC Final, Upcoming Test Matches, Test Format, Cricket, Latest Cricket News, Cricket Live Updates, India, BCCI, Sports News, Sports Live Updates, Mango News, Mango News Telugu

రేపటి నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ జరగనుంది. ఈ రెండు దేశాల మద్య దాదాపు 633 రోజుల తర్వాత మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కాబోతుంది. తొలి మ్యాచ్ చెన్నై చెపాక్ స్టేడియంలో జరగనుంది. బంగ్లాదేశ్‌ను ఓడించడం ద్వారా భారత జట్టు తమ విజయ పరంపరను కొనసాగించాలని చూస్తోంది. బంగ్లాదేశ్‌పై 13 టెస్టు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 11 సార్లు ఓడగా, రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

ఇటీవలె జరిగిన టెస్టు సిరీస్ లో పాకిస్తాన్ పై బంగ్లాదేశ్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. అటువంటి ప్రదర్శననే భారత్ పై కూడా పునరావృతం చేయాలనే పట్టుదల మీద బంగ్లాదేశ్ ఉంది.  పాకిస్థాన్‌పై చారిత్రాత్మక విజయం తర్వాత బంగ్లాదేశ్ జట్టు భారత్‌ను ఓడించాలని చూస్తుంది. ఈ ఉత్కంతపోరులో ముగ్గురు ఆటగాళ్లు కీలకంగా మారారు. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ నహిద్ రాణా ఇటీవల తన ప్రాణాంతకమైన బౌలింగ్‌తో పాక్ బ్యాట్స్‌మెన్‌లను ముప్పుతిప్పలు పెట్టించాడు. పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో గంటకు 145-150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్‌ చేసి 4 వికెట్లు పడగొట్టాడు. 21 ఏళ్ల నహిద్ భారత్ పై మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలడని విశ్లేషిస్తున్నారు.

కొన్నేళ్లుగా ఆల్ రౌండర్ పాత్ర పోషిస్తున్నాడు మెహదీ హసన్. 26 ఏళ్ల మెహదీ భారత్‌పై టెస్టులు మరియు వన్డేల్లో మంచి ప్రదర్శన చేశాడు. 45 టెస్టులు ఆడి 1625 పరుగులు చేసి మొత్తం 174 వికెట్లు పడగొట్టాడు. 2022 వన్డే సిరీస్‌లో మెహద బ్యాట్ మరియు బాల్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. ఆ సమయంలో అతను రెండు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీశాడు. ప్రస్తుతం మెహదీ ఫామ్‌లో ఉన్నాడు. పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు. పాకిస్థాన్‌పై రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 155 పరుగులు చేసి 10 వికెట్లు పడగొట్టాడు. ముష్ఫికర్‌ రహీమ్‌ ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో 191 పరుగుల ఇన్నింగ్స్‌ ఆడాడు. రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. భారత్‌పై రహీమ్‌ రికార్డు అద్భుతంగా ఉంది. అతను 15 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 604 పరుగులు చేశాడు. ఈ పరిస్థితిలో అతను రాబోయే టెస్ట్ సిరీస్‌లో భారత్‌కు ముప్పుగా మారవచ్చు. ప్రస్తుతం ఈ ముగ్గురు ఆటగాళ్ల గురించి అందరూ చర్చించుకుంటున్నారు. మరి వీళ్ళు భారత్ పై ఆ జోరు కొనసాగిస్తారా చూడాలి.