అండర్-19 ప్రపంచకప్‌ 2022 : 17 మందితో కూడిన భారత జట్టు ఎంపిక

2022 U19 World Cup, BCCI announce Team India’s squad for U19 World Cup 2022, BCCI announces India squad for ICC U19 World Cup 2022, Every ICC Men’s U19 Cricket World Cup 2022 squad, ICC U-19 Cricket World Cup 2022 squad announced, ICC U19 Cricket World Cup, ICC U19 Cricket World Cup 2022, ICC Under-19 World Cup 2022, ICC Under-19 World Cup 2022 Announced, India announce ICC U19 World Cup 2022 squad, India announce squad for U-19 World Cup 2022, India squad for ICC U-19 World Cup announced, India Squad for ICC Under-19 World Cup 2022, India Squad for ICC Under-19 World Cup 2022 Announced, India Under 19 team 2022 players list, India’s squad for ICC U-19 World Cup 2022 announced, Mango News, U19 World Cup, U19 World Cup 2022

వెస్టిండీస్ వేదికగా జనవరి 14, 2022 నుండి ఫిబ్రవరి 5, 2022 వరకు ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో పాల్గొనే భారత్ జట్టును బీసీసీఐ నేతృత్వంలోని ఆల్-ఇండియా జూనియర్ సెలక్షన్ కమిటీ ఆదివారం నాడు ఎంపిక చేసింది. అండర్-19 ప్రపంచ కప్ టోర్నీ 14వ ఎడిషన్‌ (2022)లో మొత్తం 48 మ్యాచ్‌ల్లో 16 జట్లు ట్రోఫీ కోసం పోటీపడనున్నాయి. భారత్ జట్టు 2000, 2008, 2012 మరియు 2018లో నాలుగు సార్లు అండర్-19 ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకోగా, 2016 మరియు 2020లో రన్నరప్‌గా నిలిచింది. మొత్తం 17 మంది ఆటగాళ్లు, ఐదుగురు స్టాండ్ బై ఆటగాళ్లతో కూడిన కూడిన అండర్-19 భారత్ జట్టుకు ఢిల్లీ ఆటగాడు యశ్‌ ధుల్‌ కెప్టెన్‌గా యాష్ ధుల్‌, ఆంధ్రా ఆటగాడు ఎస్‌కే రషీద్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. మరోవైపు హైదరాబాద్‌ కు చెందిన ఆటగాడు రిషిత్‌ రెడ్డి స్టాండ్‌బైగా ఎంపికయ్యాడు.

అండర్‌-19 భారత్ జట్టు: యశ్ దుల్(కెప్టెన్), ఎస్‌కే రషీద్(వైస్ కెప్టెన్), హర్నూర్ సింగ్, అంగ్‌క్రిష్ రఘువంశీ, నిశాంత్ సింధు, సిద్థార్థ్ యాదవ్, అనీశ్వర్ గౌతమ్, దినేశ్ బనా (వికెట్ కీపర్), ఆరాధ్య యాదవ్ (వికెట్ కీపర్), రాజ్ అంగద్ బవా, మానవ్ పరాక్, కుశాల్ తంబే, ఆర్‌ఎస్ హంగర్కేర్, వసు వాత్స్, విక్కీ ఉత్సవల్, రవి కుమార్, గర్వ్ సంగ్వాన్.

స్టాండ్ బై ప్లేయర్లు: రిషిత్ రెడ్డి, ఉదయ్ శహరణ్, అన్ష్ ఘోసాయ్, అమ్రిత్ రాయ్ ఉపాధ్యాయ్, పీఎం సింగ్ రాథోర్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =