ఐసీసీ టెస్ట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మూడో ఎడిషన్‌లో ఫైనల్స్‌కు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న టీమ్ ఇండియా.. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే 2 మ్యాచ్‌ల టెస్ట్ క్రికెట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. సెప్టెంబర్ 19న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సిరీస్‌లో తొలి మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ పటిష్టమైన ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది.
బంగ్లాదేశ్ జట్టును తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే, ఇటీవల పాకిస్థాన్ పర్యటనలో 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి ఆత్మవిశ్వాసంతో ఉంద ఆ జట్టు. క్రికెట్ చరిత్రలో పాకిస్థాన్‌పై ఇప్పటివరకు ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవని బంగ్లాదేశ్ జట్టు ఇప్పుడు టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుని చారిత్రక ఘనత సాధించింది. కాబట్టి బంగ్లాదేశ్‌పై గెలవడానికి టీమ్ ఇండియా కు ఖచ్చతితంగా అత్యుత్తమ జట్టుతోనే బరిలోకి దిగనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
తుది 11 మంది ఆటగాళ్లు (అంచనా) హిత్ శర్మ (కెప్టెన్/ఓపెనర్)
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎన్నో రికార్డులపై కన్నేశాడు. మంచి రిథమ్‌లో ఉన్న హిట్‌మ్యాన్ బంగ్లా సిరీస్‌లో భారీ స్కోర్లు నమోదు చేసినా ఆశ్చర్యం లేదు. జట్టును ముందుండి నడిపించే సత్తా రోహిత్‌కు ఉంది.
02. యస్సవ్ జైస్వాల్ (ఓపెనర్)
టీమిండియాకు కాబోయే సూపర్‌స్టార్‌గా యస్సావ్ జైస్వాల్ గుర్తింపు పొందాడు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టు సిరీస్‌లో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ 700కు పైగా పరుగులు చేశాడు. ఇప్పుడు బంగ్లాదేశ్‌పై పరుగుల వరద పారిస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు.
- శుభమాన్ గిల్ (బ్యాటర్)
ఓపెనర్ స్థానానికి దూరమై వన్ డౌన్ ఆర్డర్‌లో బ్యాటింగ్ కు వస్తున్న యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ అత్యుత్తమ ప్రదర్శన చేయడం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ స్థానంలో సుదీర్ఘంగా ఆడిన ఛెతేశ్వర్ పుజారా స్థానాన్ని భర్తీ చేసే పనిలో ఉన్నాడు.
- విరాట్ కోహ్లీ (బ్యాటర్)
ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లి ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్‌లోకి పునరాగమనం చేయనున్నాడు. టెస్టు క్రికెట్‌లో సెంచరీల కరువును ఎదుర్కొన్న కోహ్లి.. రెడ్ బాల్ క్రికెట్‌లో తన రికార్డును మెరుగుపరుచుకునేందుకు వేచి చూస్తున్నాడు.
- KL రాహుల్ (బ్యాటర్)
భారత జట్టులో స్థానం నిలుపుకోవాలనే ఒత్తిడిలో ఉన్న కేఎల్ రాహుల్ కు బంగ్లాదేశ్ తో జరిగే సిరీస్ చివరి అవకాశంగా నిలిచే అవకాశం ఉంది. రాహుల్ ఇక్కడ భారీ స్కోరు చేయకపోతే తదుపరి సిరీస్‌కు ఎంపిక కావడం అనుమానమే.
- రిషబ్ పంత్ (వికెట్ కీపర్/ బ్యాట్స్‌మన్)
డిసెంబర్ 2022 తర్వాత రిషబ్ పంత్ తొలిసారి భారత టెస్టు జట్టులోకి తిరిగి వచ్చాడు. వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ ఇప్పటికే వైట్‌బాల్ క్రికెట్‌లో తన సత్తాను నిరూపించుకున్నాడు మరియు టెస్ట్ క్రికెట్‌లో అదే రిథమ్‌కు తిరిగి రావాలని ఎదురుచూస్తున్నాడు. కారు ప్రమాదం తర్వాత, అతని క్రికెట్ కెరీర్ ముగిసిందనుకున్నారు. అయితే సర్జరీ నుంచి కోలుకున్న పంత్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమయ్యాడు.
- రవిచంద్రన్ అశ్విన్ (ఆఫ్ స్పిన్నర్)
భారత దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఇది పరీక్ష సమయం. బౌలింగ్ మాత్రమే కాదు, అవకాశం ఇస్తే బ్యాటింగ్ కూడా చేయడానికి సిద్దమవుతున్నాడు.
- రవీంద్ర జడేజా (ఆల్ రౌండర్)
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రవీంద్ర జడేజా.. 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత తొలిసారి భారత జట్టు తరఫున ఆడేందుకు సన్నద్దమవుతున్నాడు. విశ్రాంతి తర్వాత అతని ఆట ఎలా ఉంది? అనే క్యూరియాసిటీ అందరి మదిలో ఉంది. విఫలమైతే, రాబోయే రోజుల్లో అతని స్థానాన్ని అక్షర్ పటేల్ భర్తీ చేయడం ఖాయం.
- కుల్దీప్ యాదవ్ (చైనామన్ స్పిన్నర్)
చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలోని ఎర్రమట్టి పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామం. టీమ్ ఇండియా తమ ప్లేయింగ్ 11 జట్టులో కుల్దీప్ యాదవ్‌ను 3వ స్పిన్నర్‌గా ఎంచుకోవడం ఖాయం. ఈ చైనామన్ బౌలర్‌కు బంగ్లాదేశ్‌పై మంచి రికార్డు ఉంది.
- జస్ప్రీత్ బుమ్రా (ఫాస్ట్ బౌలర్)
2024 T20 ప్రపంచ కప్‌ను గెలవడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, 2 నెలల విరామం తర్వాత క్రికెట్‌కు ఆడబోతున్నాడు. బంగ్లా టెస్టులో బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాడా? లేదా అనేది వేచి చూడాల్సిందే.
- మహ్మద్ సిరాజ్ (ఫాస్ట్ బౌలర్)
టీమ్ ఇండియా తరపున అన్ని రకాల క్రికెట్ ఆడుతున్న యువ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్.. అన్నింటినీ రిస్క్ చేసి బౌలింగ్ చేసే ధైర్యశాలి. కొత్త బంతిపై స్వింగ్ రాబట్టడంలో దిట్ట. కీలక సమయాల్లో వికెట్లు తీయడంలో సిరాజ్ దిట్ట.