టీ20 ప్రపంచకప్‌-2022 కోసం ఎంపికైన న్యూజిలాండ్ జట్టు ఇదే

New Zealand Announced Their 15 Member Squad for the ICC Mens T20 World Cup, New Zealand Squad ICC T20 World Cup 2022, New Zealand T20 World Cup 2022 Squad, New Zealand ICC T20 World Cup Squad, New Zealand World Cup Squad, Kane Williamson , Finn Allen, Trent Boult, Michael Bracewell, Mark Chapman, Devon Conway , Lockie Ferguson, Martin Guptill, Adam Milne, Daryl Mitchell, Jimmy Neesham, Glenn Phillips, Mitchell Santner, Ish Sodhi, Tim Southee

ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్-2022 కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. న్యూజిలాండ్ టీ20 జట్టుకు కేన్ విలియమ్సన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. కాగా ఇటీవల న్యూజిలాండ్ జట్టు సెంట్రల్ కాంట్రాక్ట్‌ను తిరస్కరించి వార్తల్లో నిలిచిన ట్రెంట్ బౌల్ట్, జిమ్మీ నీషమ్ జట్టులో చోటు దక్కించుకున్నారు. అలాగే కొత్తగా సెంట్రల్ కాంట్రాక్ట్‌ పొందిన ఫిన్ అలెన్ కూడా తాజా జాబితాలో ఉన్నాడు. ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్ తమ మొదటి ప్రపంచ కప్‌ ఆడనున్నారు. ఇక ఏడు టీ20 ప్రపంచకప్‌లలో పాల్గొన్న తొలి న్యూజిలాండ్ ఆటగాడిగా మార్టిన్ గప్టిల్ నిలవనున్నాడు.

గాయం కారణంగా ఇటీవలి పర్యటనలకు దూరమైన ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే ప్రపంచ కప్ కోసం జట్టుకు ఎంపికయ్యాడు. వికెట్ కీపర్‌ డెవాన్ కాన్వే, బౌలర్లు మార్క్ చాప్‌మన్, ఇష్ సోధి కూడా తమ స్థానాలను నిలుపుకున్నారు. బౌల్ట్, ఫెర్గూసన్, టిమ్ సౌతీ, ఆడమ్ మిల్నేలతో మంచి పేస్ అటాక్‌, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, సాంట్నర్, బ్రేస్‌వెల్, నీషమ్ వంటి ఆల్ రౌండర్స్ తో న్యూజిలాండ్ జట్టు బలంగా ఉంది. ఇక ఇదే జట్టు అక్టోబర్ ప్రారంభంలో పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్‌లతో టీ20 ముక్కోణపు టీ20 సిరీస్‌ ఆడుతుంది.

టీ20 ప్రపంచకప్‌-2022 కోసం ఎంపికైన న్యూజిలాండ్ జట్టు:

  1. కేన్ విలియమ్సన్ (కెప్టెన్)
  2. టిమ్ సౌతీ
  3. ఇష్ సోధి
  4. మిచెల్ సాంట్నర్
  5. గ్లెన్ ఫిలిప్స్
  6. జిమ్మీ నీషమ్
  7. డారిల్ మిచెల్
  8. ఆడమ్ మిల్నే
  9. మార్టిన్ గప్టిల్
  10. లాచ్లాన్ ఫెర్గూసన్
  11. డెవాన్ కాన్వే
  12. మార్క్ చాప్‌మన్
  13. మైఖేల్ బ్రేస్‌వెల్
  14. ట్రెంట్ బౌల్ట్
  15. ఫిన్ అలెన్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − six =