అంతర్జాతీయ టీ20 క్రికెట్ మ్యాచ్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సమోవాన్ బ్యాట్స్‌మెన్ డారియస్ విస్సర్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీంతో భారత జట్టు దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును సమోవా బ్యాట్స్‌మెన్ తుడిచిపెట్టేశాడు.
ఐసిసి టి 20 క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్ క్వాలిఫైయింగ్ రౌండ్ మ్యాచ్‌లో వనాటు జట్టుపై అమోవా ఆటగాడు డారియస్ విస్సర్ కేవలం ఒక ఓవర్లో 39 పరుగులు చేశాడు. టీ20 క్రికెట్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇదే. దీంతో యువరాజ్ సింగ్ (2007), కీరన్ పొలార్డ్ (2021), దీపేంద్ర సింగ్ ఐరీ (2024), నికోలస్ పూరన్ (2024) పేరిట ఉన్న రికార్డును చెరిపేసాడు. ఈ బ్యాట్స్‌మెన్‌లు ఒక T20I మ్యాచ్‌లో ఒక ఓవర్‌లో 36 పరుగుల రికార్డు చేశారు.
ఒకే ఓవర్లో 39 పరుగులు
డేరియస్ తన అద్భుత ఇన్నింగ్స్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వనాటు బౌలర్ నలిన్ నిపికో ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేయడానికి వచ్చాడు. అతని బౌలింగ్ లో డారియస్ 6 సిక్సర్లు బాదాడు. మధ్యలో, 3 బంతులు నో బాల్స్, ఫలితంగా ఓవర్‌లో మొత్తం 39 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌లో డాట్ బాల్ కూడా పడటం మరో హైలెట్.
ఒకే ఇన్నింగ్స్ లో 14 సిక్సర్లు
తన తొలి T20I సెంచరీని సాధించిన డారియస్ విస్సర్, తన చారిత్రాత్మక ఇన్నింగ్స్ లో 14 సిక్సర్లు మరియు 5 ఫోర్లు కొట్టాడు. దీంతో తూర్పు ఆసియా పసిఫిక్‌లో జరిగిన ప్రపంచ కప్ క్వాలిఫైయింగ్ రౌండ్ టోర్నమెంట్‌లో సమోవాన్ జట్టు వరుసగా 2వ విజయాన్ని అందుకుంది.