అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన హర్భజన్ సింగ్

2011 World Cup Winner Harbhajan Singh Announces Retirement, Harbhajan Singh Announces Retirement, Harbhajan Singh announces retirement from all formats, Harbhajan Singh Announces Retirement from All Formats of Cricket, Harbhajan Singh announces retirement from all forms of cricket, Harbhajan Singh Retirement, India spinner Harbhajan Singh retirement, Indian Cricketer Harbhajan Singh Announces Retirement, Indian Cricketer Harbhajan Singh Announces Retirement from All Formats of Cricket, Mango News, Veteran Spinner Harbhajan Singh Announces Retirement

టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ఇస్తున్నట్లుగా శుక్రవారం నాడు ట్విట్టర్ లో హర్భజన్ సింగ్ ప్రకటన చేశాడు. “అన్ని మంచి విషయాలు ముగిశాయి మరియు ఈ రోజు నేను జీవితంలో నాకు అన్నింటినీ అందించిన ఆటకు వీడ్కోలు పలుకుతున్నందున, ఈ 23 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని అందంగా మరియు చిరస్మరణీయంగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా హృదయపూర్వక ధన్యవాదాలు. కృతజ్ఞతలు” అని హర్భజన్ సింగ్ ట్విట్టర్ పోస్ట్‌లో రాశారు

41 ఏళ్ల హర్భజన్ సింగ్ భారత్ తరపున మొత్తం 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ-20 మ్యాచుల్లో ఆడాడు. టెస్టుల్లో 417 వికెట్స్ పడగొట్టగా, వన్డేల్లో 269, టీ-20ల్లో 25 సాధించాడు. ఇక ఈ మూడు ఫార్మాట్లలో కలిపి 3570 పరుగులు చేశాడు. 2011 వన్డే ప్రపంచకప్‌ లో భారత జట్టు విజయంలో హర్భజన్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. 1998లో ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ తో క్రికెట్ లో అరంగ్రేట్రం చేసిన హర్భజన్, చివరిసారిగా భారత్ తరుపున మార్చి 3, 2016లో ఢాకాలో యూఏఈతో జరిగిన టీ-20 మ్యాచ్ లో ఆడాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఎక్కువుగా ముంబయి ఇండియన్స్ ప్రాంఛైజీ తరపున ఆడిన భజ్జి ఎన్నోసార్లు ఆ జట్టు విజయాల్లో కీలకంగా ఉన్నాడు. ముంబయితో పాటుగా కోల్ కతా, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు భజ్జి ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో మొత్తం 163 మ్యాచ్‌లు ఆడి 150 వికెట్లుతో పాటుగా 833 పరుగులు చేశాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =